Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమ్మకు కనీసం చీర కొనివ్వలేదు.. మా డైరెక్టర్‌ది జెర్సీలో నాని లాంటి స్టోరి.. సందీప్ కిషన్
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ...
మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా నిను వీడని నీడను నేనే. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్ కి మంచి పేరు తెచ్చిపెడతా అని సందీప్ కిషన్ అన్నారు.
నిను వీడని నీడను నేనే దర్శకుడు కార్తీక్ రాజుగారిది 'జెర్సీ'లో నాని లాంటి స్టోరీ. ఆయనకు 46 ఏళ్లు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సీజీ టెక్నీషియన్. మంచి ఉద్యోగం వదులుకుని దర్శకుడు అవ్వాలని ఎనిమిదేళ్ల క్రితం డిసైడ్ అయితే... ఇంట్లో సపోర్ట్ చేశారు. ఇవ్వాళ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాలో నాకోసం పాట పాడిన సిద్ధార్థ్, మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్, మా బ్రదర్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివా చెర్రీ, సీతారామ్.. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్ అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.