Unstoppable 4: బాలయ్య షోలో హీరో సూర్య కంటతడి.. ఆ విషయంలో సింగం అంత వీకా?

Unstoppable S4: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే ('Unstoppable with NBK). ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ టాక్ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇటీవల ప్రారంభమైన 4వ సీజన్ కూడా జోష్ పుల్ గా సాగుతోంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‍కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా రాగా.. రెండవ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ మూవీ టీమ్ సందడి చేసింది. తాజాగా మూడో ఎపిసోడ్లో సూర్య తో పాటు కంగువ మూవీ టీమ్ విచ్చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆహా రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రారంభం కాగానే.. 'నేను సింహం అయితే .. అతను సింగం.. నేను లెజెండ్ అయితే.. అతను గజినీ, నేను అఖండ అయితే.. అతను రోలెక్స్.. దట్ జీ.. వన్ అండ్ ఓన్లీ సూర్య " అంటూ హీరో సూర్యను ఆహ్వనిస్తారు బాలకృష్ణ. ఇక సూర్య రాగానే.. హృదయం ఎక్కడ ఉన్నది అనే పాట పాడుతూ..సూర్యతో స్టెప్పు లేపిస్తాడు బాలకృష్ణ. ఆ తర్వాత సూర్యతో సరదాగా మాట్లాడుతూనే.. ఇరకడంలో పెట్టే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు బాలకృష్ణ. ఈ సమయంలో కార్తీక్ తన ఫోన్ లో నీ పేరు ఏమని సేవ్ చేసుకున్నాడని సూర్యను ప్రశ్నిస్తాడు. దీంతో షాక్ అయిన సూర్య.. 'ఫస్ట్ క్యూస్షన్ నే అవుట్ ఆఫ్ సిలబస్' అనడంతో షోలో నవ్వుల పువ్వులు పూస్తాయి.

hero suriya emotional in nandamuri balakrishna s Unstoppable with NBK talk show Season 4

సూర్య మరింత ఇరగటం పెట్టేలా.. మీ ఫస్ట్ క్రష్ ఎవరనీ ప్రశ్నిస్తాడు బాలయ్య. ఆ ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేననీ, తాను మళ్లీ ఇంటికి వెళ్లాలంటూ సమాధానం దాటవేస్తాడు సూర్య. ఆ తర్వాత బాలయ్య .. కార్తీక కు ఫోన్ చేసి..' మీ అన్నయ్య చాలా అబద్దాలు ఆడుతున్నాడు కదా' అని ప్రశ్నించగా.. కార్తీక్ కూడా 'చిన్నప్పటినుండి ఆయన అంతే సార్ 'అంటూ ఫన్నీ రిప్లై ఇస్తాడు. కార్తీ అక్కడితో ఆగుకుండా.. ' వాడికి ఓ యాక్టర్ అంటే చాలా ఇష్టం సార్ ..' అంటూ సూర్యను ఇరకాటంలో పడేస్తాడు కార్తీ. ఆ సమాధానానికి సూర్య రియాక్ట్ అవుతూ..'రేయ్ నువ్వు కార్తీ కాదురా.. నువ్ కత్తి రా' అని అంటాడు. దీంతో బాలకృష్ణ ఫోన్ పగలగొడతానని తన చేతిలో ఉన్న ఫోన్ ను పైకి లేపుతాడు. 'అరేయ్ ఇది నా ఫోనా 'అనడంతో ఆడియోస్ మొత్తం గల్లుమని నవ్వుతారు.

అనంతరం ఓ గేమ్ ఆడిస్తూ.. ' నువ్వు సీక్రెట్ విషయాలను ఎవరితో షేర్ చేసుకుంటావ్ ?' అని సూర్యను ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు సూర్య సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండి పోతాడు. బాలయ్య వెంటనే.. చేతుల పట్టుకుని.. పల్స్ 150 ఉంది కదా.. అని బాలకృష్ణ అనగానే.. హార్ట్ 250 కొట్టుకుంటుందని సెటైరికల్ ఆన్సర్ ఇస్తాడు సూర్య. ఈ సమయంలో సూర్య జ్యోతిక ఫై తన లవ్ ను ఎక్స్ ప్రెస్ చేస్తూ.. జ్యోతి కాలేకపోతే సూర్య లేడంటూ ఎమోషనల్ అవుతాడు.

ఇలా సరదాగా సాగుతున్న ఈ షోలో.. సూర్య సోషల్ సర్వీస్ గురించి మాట్లాడుతూ.. నేను సమాజంలో ఒక మంచి మనిషిలా బతకాలని ఆశిస్తున్నానని పేర్కొంటాడు. ఈ సమయంలో సూర్యని సర్ప్రైజ్ చేస్తూ.. బాలకృష్ణ ఓ ఎమోషనల్ వీడియోను ప్లే చేస్తాడు. అందులో హీరో సూర్య నుండి సహాయం అందుకున్న ఓ అమ్మాయి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాటలు విన్న సూర్య కంటతడి పెట్టుకుంటాడు. ఈ సమయంలో బాలకృష్ణ కూడా కాస్త ఎమోషనల్ గా మాట్లాడతాడు. నా దృష్టికి వచ్చిన విషయాల పట్ల తాను స్పందిస్తున్నానని, వారికి నాకు తోచినంత సహాయం చేస్తున్నానని తెలిపారు. తనతో పాటు చాలామంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని, హలో శుభసూచకం అంటూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సూర్య.

ఆ తర్వాత కంగువ డైరెక్టర్ శివ, బాలీవుడ్ యాక్టర్ బాబి డియోలను షోలోకి ఆహ్వానిస్తాడు. వారితో కూడా సరదా సరదా మాటలతో.. సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతూ ఇరకటంలో పడేస్తాడు బాలయ్య. ఈ ఎపిసోడ్ నవంబర్ 8న స్ట్రీమింగ్ కానున్నది. వాచ్ అండ్ ఎంజాయ్.

More from Filmibeat

Read more about: suriya bobby deol balakrishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X