ఆ సక్సెస్ పుల్ డైరెక్టర్ రాజమౌళికి భక్తుడా..? సీక్రెట్ బయటపెట్టిన సూర్య

Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందుతే.. ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్నారు. అదే సమయంలో తెలుగు సినిమా స్థాయిని, సత్తాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. అలాంటి సెన్సేషనల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు కోట్లాది మంది అభిమానులే కాకుండా.. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారెందరో ఉన్నారు. ఈ జాబితాలో ఓ కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. ఇంతకీ జక్కన్నను దేవుడిలా అభిమానించే ఆ ప్రొడ్యూసర్ ఎవరు?

డైరెక్టర్ రాజమౌళిని అమితంగా అభిమానించే ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. కోలివుడ్ సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ కె ఇ జ్ఞానవేల్ రాజా(K. E. Gnanavel Raja).
తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీని అందించారు. ప్రస్తుతం తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య నటించిన కంగువా సినిమాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్ దిశా పటానీ, బాబీ డియోల్‌ లీడ్ లో నటించారు. అలాగే.. యోగి బాబుతో పాటు పలువురు ప్రముఖ నటులు కంగువా సినిమాలోని నటించారు. ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

hero Suriya revealed secret that Kollywood producer K E Gnanavel Raja has set director Rajamouli s photo as moblie wallpaper

ఫేమస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ మూవీ కంగువా.. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ మూవీ భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10,000 స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల కోసం కోట్లాది మంది ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కంగువా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే కంగువ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గురువారం నాడు హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి బోయపాటి శ్రీను, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధులుగా వస్తున్నారు.

hero Suriya revealed secret that Kollywood producer K E Gnanavel Raja has set director Rajamouli s photo as moblie wallpaper

కంగువ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో సూర్య ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా దర్శకధీరుడు రాజమౌళి ఎదుట. హీరో సూర్య మాట్లాడుతూ..'మనం ఎవరైనా సెల్ ఫోన్ వాల్ పేపర్ గా.. మన ఫోటో, లేదా మన భార్య, పిల్లల ఫోటోలు.. లేదంటే దేవుని ఫోటోలు పెట్టుకుంటాం. కానీ డైరెక్టర్ జ్ఞానవేల్ మాత్రం ఆ విషయంలో వేరు. నాకు ఆయన తెలిసినప్పటినుండి.. మీ ఫోటో (రాజమౌళి)నే సెల్ ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. జ్ఞానవేల్ కు మీరంటే.. భక్తి, అభిమానం' అంటూ తెలిపి రాజమౌళినీ సర్ప్రైజ్ చేశారు సూర్య. దీంతో ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా స్టేజ్ పైకి వచ్చి, తన ఫోన్ లోని రాజమౌళి ఫోటోను చూపిస్తూ.. డైరెక్టర్ రాజమౌళి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఇక రాజమౌళి విషయానికి వస్తే.. మహేష్ బాబుతో భారీ బడ్జెట్ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న కష్టపడుతున్నారు.

More from Filmibeat

Read more about: suriya rajamouli kanguva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X