మహిళా దర్శకురాలితో సూర్య కొత్త చిత్రం ప్రారంభం!
తమిళ, తెలుగు రెండు భాషల్లో క్రేజ్ ఉన్న హీరో సూర్య. సూర్య విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటనలో దూసుకుపోతున్నాడు. సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. సూర్య నటిస్తున్న ఎన్ జి కె చిత్రం మే 31న విడుదలకు సిద్ధం అవుతోంది. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు. మరోవైపు క్రేజీ దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య కాప్పాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉండగానే సూర్య మరో చిత్రాన్ని ప్రారంభించాడు.
ప్రముఖ మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య తదుపరి చిత్రం ప్రారంభమైంది. చెన్నైలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సూర్య 38వ చిత్ర ప్రారంభోత్సవానికి అతడి తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ అతిథులుగా హాజరయ్యారు. సుధా కొంగర 'ఇరుది సట్రు' చిత్రంతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ చిత్రంలో సూర్యకు జోడిగా యంగ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి నటిస్తోంది. సోమవారం రోజే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో సూర్య సౌత్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.


Click it and Unblock the Notifications











