తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సూర్య.. నిర్మాతగా కూడా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ మార్కెట్ సెట్ చేసుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి. ఇక సూర్య ఎంచుకునే కథలు కుడా ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. చిన్న కథలు నచ్చితే సొంతంగా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడం అలవాటే.
ఇప్పటికే తమ్ముడు కార్తీతో కొన్ని సినిమాలు చేశాడు. సూర్య హోమ్ ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ ను ఇక తెలుగులో కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా తెలుగు వాళ్ళతోనే ఒక సినిమా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఒక బిగ్ ప్రొడక్షన్ హౌజ్ తో చేతులు కలిపి సంయుక్తంగా సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్న సూర్య అనంతరం సోలోగా ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతం కొత్త తరహా కథలపై తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక సూర్య చివరగా ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదలైన ఆ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్న సూర్య త్వరలోనే సింగం దర్శకుడు హరితో కూడా కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











