750 రూపాయల జీతం నుంచి ఇప్పుడు 500 కోట్ల ఆస్తులు.. ఆ టాప్ హీరో ఎవరో తెలుసా?
సినిమా చాలా మంది జీవితాలను ఊహించని విధంగా మార్చివేస్తుంది. సినిమా మీద నిజంగా అమితమైన ఫ్యాషన్ ఉండి సినిమా వైపు నడిచి వస్తే ఆ సినిమానే మిమ్మల్ని ఇండస్ట్రీలో నడిపిస్తుంది అని చాలా మంది నమ్ముతారు. అలా ఒక్క తెలుగు సినిమాలో అనే కాదు వరల్డ్ వైడ్ సినిమా దగ్గర పరిచయం అయ్యిన ఎంతోమంది నటీనటులు ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజికి వచ్చారు.
అయితే ఇపుడు సినిమాల్లో పెద్ద స్టార్స్ కావచ్చు. కానీ వారి గతం మరొకటి ఉంటుంది అలా ఎంతోమంది స్టార్ నటులు తమ స్టార్డంకి ముందు ఎంతో సాధారణంగా జీవనం గడిపేవారు ఉండుంటారు. అలా సౌత్ నుంచే చాలా మంది స్టార్ హీరోలు నటులుగా చేయక ముందు ఎన్నో కష్టాలు రోజు గడిచేందుకే ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నవారు ఉంటారు.

మరి అలా సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి మొన్న కేజీయఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ ల వరకు సినిమాల కంటే ముందు చాలా సర్వ సాధారణ ఉద్యోగాలు చేసినవారు ఉన్నారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం సినిమాల్లోకి రాకముందు కేవలం నెలకి 750 రూపాయల జీతంతో తన సంపాదన స్టార్ట్ చేసి ఇపుడు 500 కోట్లకి పైగా ఆస్తులు పోగేసుకున్నాడట.
అలా పోగేసి అందులో ఎన్నో కోట్లు ఛారిటీలకే అందిస్తున్నాడు. మరి ఆ రియల్ హీరో ఎవరో కూడా కాదు తమిళ స్టార్ నటుడు సూర్య అట. తన కెరీర్ స్టార్టింగ్ కి ముందు సూర్య ఒక గార్మెంట్ కంపెనీలో కేవలం 750 రూపాయలకి పని చేసాడట. కానీ నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చి ఇపుడు పెద్ద స్టార్ అయ్యి హీరోగా నిర్మాతగా కూడా బాగా సంపాదించుకున్నాడు. ఇలా తాను 500 కోట్లకి పైగా ఆస్తిని చేసుకున్నాడని తెలుస్తుంది.

కాగా ఇపుడు సూర్య చేసిన భారీ పాన్ ఇండియా సినిమా కంగువా తనకి హీరోగా పాన్ ఇండియా క్రేజ్ ఇస్తుంది అని చాలా ఆశిస్తున్నాడు. అలాగే తాను నిర్మాతగా తన తమ్ముడు కార్తీ హీరోగా నటించిన క్లీన్ సినిమా సత్యం సుందరం ఓటిటిలో అదరగొడుతుంది. ఇలా సూర్య హీరోగా నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ గా దూసుకెళ్తున్నాడు.
అలాగే తాను తమిళ నాట ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. ఎంతో మంది పిల్లలని ఉన్నత చదువులు కూడా తన సంపాదనతోనే చదివిస్తూ ఒక మార్గ దర్శకం అయ్యాడు. దీనితో సూర్య అంటే ఆఫ్ లైన్ పరంగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాగా ఇపుడు నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా కంగువా ఈ నవంబర్ 14న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాని 3డి, 2డి లో కూడా ప్లాన్ చేశారు. ఇంకా ఈ భారీ సినిమాని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు కలిపి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











