షాకింగ్ న్యూస్ చెప్పిన హీరో సూర్య: భయంతో మనగడ సాధించలేరు అంటూ ట్వీట్

పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు టాలెంటెడ్ స్టార్ సూర్య. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. నాలుగు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ.. ఎంతో ఫిట్‌గా కనిపిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ కోలీవుడ్ స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు.

ఆదివారం జరిగిన కోవిడ్ టెస్టుల్లో హీరో సూర్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ''నేను కరోనా వైరస్ బారిన పడ్డాను. తాజాగా చేసిన పరీక్షల్లో నాకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాను. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినా.. కరోనా విషయంలో జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని అందరూ గ్రహించాలి. భయంతో మనుగడ సాధించలేరు. అందుకే భద్రత, శ్రద్ధ అవసరం. వృత్తికి అంకితమై.. సేవలు అందిస్తున్న వైద్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని వెల్లడించాడు.

 Hero Suriya tested for Corona Positive

ఇదిలా ఉండగా.. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా' (సూరారై పొట్రు). సుధ కొంగర తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మొదటిరోజు నుంచే మంచి టాక్‌ను అందుకున్న ఈ మూవీ.. రెండు భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, ఓటీటీలో మొదటి విజయాన్ని అందుకున్న చిత్రంగానూ రికార్డులకెక్కింది. అలాగే, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డులైన గ్లోబల్ గోల్బ్, అస్కార్‌‌ నామినేషన్స్‌కు ముందు ప్రదర్శించే చిత్రాల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది.

 Hero Suriya tested for Corona Positive

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X