For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘చిలసౌ’కి రెండేళ్లు.. సుశాంత్ ఎమోషనల్ పోస్ట్

    |

    అక్కినేని వారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చినా.. సరైన సక్సెస్‌లు లేక కాస్త వెనుకబడ్డాడు. మొదటి చిత్రం కాళిదాసుతోనే మంచి విజయం అందుకున్నాడు. ఆపై కరెంట్ వంటి మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయితే కమర్షియల్ హీరోగా ముద్ర వేయించుకోవాలన్న తపనతో మధ్యలో చేసిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. చిలసౌ వంటి కథా ప్రాముఖ్యమున్న చిత్రంతో సుశాంత్‌కు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.

    సుశాంత్ కెరీర్ ఇక ముగిసిందని అంతా అనుకుంటున్న సమయంలోనే చిలసౌ అనే చిత్రం వచ్చింది. క్లాస్ అండ్ క్లాసికల్‌గా తెరకెక్కిన చిలసౌ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్నో యేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన సుశాంత్‌కు చిలసౌ తన కెరీర్‌లో నిలిచిపోయింది. ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సుశాంత్ మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అల వైకుంఠపురములో ఓ స్పెషల్ రోల్‌ను పోషించాడు.

    Hero Sushanth About 2 years of Chi La Sow

    చిలసౌ చిత్రం విడుదలై (ఆగస్టు 3) రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా సుశాంత్ ఎమోషనల్ అయ్యాడు. 'మా ఈ చిన్న చిత్రం, నిజాయితీతో కూడుకున్న చిత్రం జాతీయ అవార్డును అందుకుంది.. ఆ ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది. కొత్త ట్రెండ్ సృష్టించడానికి కావాల్సిన నమ్మకాన్ని ఇచ్చింది. మీ ప్రేమ దక్కడానికి, మా మొహాలపై చిరునవ్వు రావడానికి పునాదులు పడ్డాయి.

    ఈ చిత్రానికి పని చేసిన టీం, ప్రేక్షకులందరికీ ధన్యవాదాల'ని తెలిపాడు. సుశాంత్ తదుపరి ప్రాజెక్ట్ ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రం కోసం మరింత స్టైలీష్‌గా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ బాగానే వైరల్ అయిన సంగతి తెలిసిందే.

    English summary
    Hero Sushanth About 2 years of Chi La Sow. What a journey for the entire team where our small, honest film won a National Award, gave us confidence to break patterns, a foundation for all of us to build on, lots of smiles and most importantly, all your Love! Thank you so much to the team & every one of you
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X