Hero Sushanth: సుశాంత్‌కు చుక్కలు చూపించిన నెటిజెన్లు.. నవ్వుతూనే తిప్పి కొట్టిన హీరో, ఈ వార్ ఏంటంటే?

హీరో సుశాంత్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని-దగ్గుబాటి కుటుంబంలో జన్మించిన ఈయన కాళిదాసు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. 2008 నుంచి ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్న ఈయన ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చేయట్లేదు. ముఖ్యంగా హీరోగా మాత్రం కనిపించట్లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఎక్స్ వేదికగా ఈయనపై పలువురు నెటిజెన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు. కానీ సుశాంత్ మాత్రం వాటిని చక్కగా.. నవ్వుతూ తిప్పి కొట్టారు. అసలు ఈ వార్ ఏంటి.. ఎందుకు ఈ గొడవంతా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాళిదాసు, ప్రస్తుతం, అడ్డా, దొంగాట, ఆటాడుకుందాం రా, చి ల సౌ వంటి సినిమాల్లో హీరోగా చేసిన ఈయన ఆ తర్వాత అవకాశాలు లేక చాలా రోజులు ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత అలా వైకుంఠపురంలో, ఇచట వాహనములు నిలపరాదు, రావణాసురుడు, భోలా శంకర్ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు. హీరోగా చేసిన ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పెద్దగా చిత్రాలు చేయని ఈయన సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను చెబుతూ.. కొత్త కొత్త ఫొటోలు పోస్ట్ చేస్తారు.

Hero Sushanth Cute Counters to Netizens Check Details

అయితే తాజాగా ఈ కుర్ర హీరో తన బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటో షేర్ చేశాడు. అలాగే క్యాప్షన్ ఏం లేదు పర్లేదుగా అంటూ రాసుకొచ్చాడు. అయితే ఇది చూసిన నెటిజెన్లు ఒక్కో విధంగా స్పందించారు. పలువురు పాజిటివ్ కామెంట్లు చేస్తే, మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా క్యాప్షన్ ఏంటి.. నువ్వే లేకపోయినా ఫర్వాలేదని ఓ నెటిజెన్ అన్నాడు. ఇది చూసిన సుశాంత్.. నీవు మాత్రం ఉండాలి బ్రో అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ చాలా కూల్ గా సమాధానం చెప్పావు బ్రో హ్యాపీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. సినిమాలే లేవు.. క్యాప్షన్ లేకపోతే ఏంటని అంటున్నారు.

Hero Sushanth Cute Counters to Netizens Check Details

క్యాప్షన్ లేకపోయినా ఫొటో ఉందిగా బ్రో అని సుశాంత్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. మరొకతను అయితే చాలా పెద్ద తప్పే చేశారు సార్ అనగా.. ఎంత పెద్ద మాట అన్నారు సార్ అని హీరో రిప్లై ఇచ్చాడు. అన్నా ఒక 1000 రూపాయలు ఇవ్వు బయటకెళ్తానంటూ మరో వ్యక్తి అడగ్గా.. బయట 39, ఫీల్స్ లైక్ 43 డిగ్రీస్ అంట బ్రో అంటూ ఎండ గురించి చెప్పుకొచ్చాడు. అలాగో మరొకతను నువ్వు పోస్ట్ పెట్టకపోయినా పర్లేదు అనగా.. నువ్వు మాత్రం పెట్టాలి ప్లీజ్.. మీ ఫాలోవర్స్ హర్ట్ అవ్వకూడదు అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు సుశాంత్. మరో నెటిజెన్ ఏం లేవా సినిమాలు నీకు, అడ్రెస్ లేవు అనగా.. నా అడ్రస్ కాదు కానీ.. నీ అడ్రస్ చెప్పవా.. బొకే కోసం అంటూ కౌంటర్ వేశాడు.

మరో అభిమాని సమ్మర్ ఎలా ఉందన్నా అనగా.. సమ్మర్ లానే ఉంది బ్రో అంటూ సుశాంత్ రిప్లై ఇచ్చాడు. సోలో మూవీ చేయండని కొందరు చెప్పగా ఓకే అన్నాడు. అలాగే ఫొటో క్లారిటీ లేదంటూ మరో అభిమాని చెప్పగా.. అరే పెద్ద సమస్యే వచ్చి పడిందే అంటూ నవ్వాడు. క్యాప్షన్ లేదనేదే క్యాప్షన్ అంటూ ఒకతను చెప్పగా.. క్యాచ్ చేశావ్ అంటూ హీరో కామెంట్ చేశాడు. మీరు పిక్ పెట్టకపోయినా బాగుండేదని మరో వ్యక్తి చెప్పగా.. మీరు రిప్లై పెట్టకున్నా బానే ఉండదని సుశాంత్ అన్నాడు. ఒకతను అయితే హద్దు దాటి మరీ అక్కినేని ఫ్యామిలీ హీరోలు అసలు పెళ్లి చేసుకోరా.. మీకు అచ్చిరావా అంటూ అడిగాడు. కానీ దీనికి మాత్రం సుశాంత్ రిప్లై ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X