తల్లి వల్లే ఆ హీరో కెరీర్ నాశనం అయిందా? యంగ్ యాక్టర్ దారుణ పరిస్థితి కారణం అదేనా?
బాలనటులుగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరో, హీరోయిన్లుగా వెలుగొందినవారు చిత్ర పరిశ్రమలో ఎందరో. ఇలాంటి వారిలో తరుణ్ ఒకరు. నటి రోజారమణి, దర్శకుడు చక్రపాణిల కుమారుడే తరుణ్. స్వతహాగా తల్లిదండ్రులిద్దరూ సినీరంగానికి చెందినవారే కావడంతో ఆయనకు చిన్నతనంలోనే అవకాశాలు వచ్చాయి. బాల్యంలోనే జాతీయ అవార్డ్ సైతం అందుకున్న ఘనత తరుణ్‌ది. 1990లో నరేష్ హీరోగా వచ్చిన మనసు మమత ద్వారా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఫస్ట్ మూవీతోనే అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
తరుణ్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా అంజలి. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం దర్వకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో తరుణ్ బాలనటుడిగా ఇరగదీశాడు. రఘువరణ్, రేవతి, ప్రభుదేవా వంటి దిగ్గజాలతో పోటీపోటీగా నటించి శెభాష్ అనిపించుకున్నాడు. 1990లో వచ్చిన ఈ సినిమాకు గాను ఆయనకు ఏకంగా జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత ఏ సినిమాలో బాలనటుడి క్యారెక్టర్ ఉన్నా తరుణ్ కావాల్సిందే. దీంతో సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచాడు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో చదువుపై ఫోకస్ పెట్టిన తరుణ్ కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ఆయనను హీరోగా పరిచయం చేసింది అదే నువ్వేకావాలి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటికీ విమర్శకుల ప్రశంసలు అందుకునే ఈ సినిమాతో తరుణ్ ఓవర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఫస్ట్ మూవీతోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే ఆయన సినిమాలు అంతులేని లాభాలను కురిపిస్తూ ఉండటంతో నిర్మాతలు తరుణ్ డేట్స్ కోసం సూట్‌కేసులతో క్యూ కట్టేవారు. ఆ వెంటనే ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వేనువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, సోగ్గాడు వంటి విజయాలతో తరుణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అమ్మాయిలైతే తమ బాయ్‌ఫ్రెండ్ తరుణ్‌లా ఉండాలని కోరుకునేవారంటే అతిశయోక్తి కాదు.
అయితే ప్రేమకథలపైనే ఫోకస్ చేయడం, మిగిలిన జోనర్స్‌పై దృష్టి పెట్టకపోవడంతో తరుణ్ ఆ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఈలోగా కొత్త హీరోలు, కొత్త కథలు పోటెత్తడంతో తరుణ్ ఫేడవుట్ అయిపోయాడు. అసలే సక్సెస్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమ.. తరుణ్‌కు ఫ్లాపులు వచ్చేసరికి ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తన కెరీర్ ఇలా అవ్వడానికి కారణాలపై ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

తాజాగా ఓ ఛానెల్‌తో తరుణ్ మాట్లాడుతూ.. నువ్వేకావాలి ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ అని అందుకే తాను చేసే తదుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నమ్మి జనం థియేటర్లకు వచ్చేవారని .. కానీ ఆ చిత్రాలు అంచనాలను అందుకోకపోవడంతో వరుస ఫ్లాపులు ఎదురయ్యాయని చెప్పారు. ఇక తన తల్లి రోజా రమణి జోక్యం ఎక్కువ కావడం వల్లే తన కెరీర్ నాశనమైందంటూ జరుగుతున్న ప్రచారం పైనా తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తన వద్దకు కథలు వస్తే ఫ్యామిలీతో కలిసి డిస్కస్ చేసేవాడినని .. కానీ సినిమా చేయాలా, వద్దా అనే నిర్ణయం మాత్రం నాదేనని ఆయన స్పష్టం చేశారు.
అయితే తన కెరీర్‌ను మళ్లీ నిలబెట్టే ఒక్క హిట్టు కోసం తరుణ్ ఇప్పటికీ ఫైట్ చేస్తుండటం విశేషం. ఇప్పుడు లవ్ స్టోరీస్ ట్రెండ్ నడవటం లేదు, వారసులూ పెరిగారు, పైగా యాక్షన్ మూవీస్‌కు తన కటౌట్ పనికిరాదు. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్‌ను తరుణ్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది రాబోయే రోజుల్లో ఆయన ఎంచుకునే సినిమాలపై ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications











