For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తరుణ్ రిజెక్ట్ చేసిన సినిమా బాక్సాఫీస్ హిట్.. ఆ మూవీ చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేది!

  |

  ఒకప్పుడు ఉదయ్ కిరణ్ తో పాటు, తరుణ్ కూడా న్యూ లవర్ బాయ్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్నాడు. దాదాపు హీరోగా వారిద్దరి కెరీర్ లు ఒకేసారి మొదలయ్యాయి. తరుణ్ బాలనటుడిగా ముందు నుంచే ప్రేక్షకులకు తెలుసు. ఇక ఈ హీరో కూడా కొన్నాళ్లకు వరుస అపజయాలు రావడంతో సినిమాలను పక్కనపెట్టి పర్సనల్ బిజినెస్ లతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. నిజానికి ఆ మధ్య తరుణ్ ఒక మంచి ఛాన్స్ ను మిస్ చేసుసుకున్నాడట. ఇటీవల ఒక సీనియర్ డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆ విషయం బయటకు వచ్చింది.

  ఆ సినిమా హిట్టవ్వడంతో

  ఆ సినిమా హిట్టవ్వడంతో

  పదేళ్ల వయసులోనే బాలనటుడిగా తరుణం బిగ్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చాడు. అంజలి, సూర్య ఐపీఎస్, ఆదిత్య 369 వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక టీనేజ్ వయసు దాటగానే 2000వ సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో తరుణ్ కు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి.

  బాక్సాఫీస్ ట్రెండ్ సెట్టర్

  బాక్సాఫీస్ ట్రెండ్ సెట్టర్

  నువ్వే కావాలి సినిమాతోనే త్రివిక్రమ్ కూడా మాటల రచయితగా క్లిక్కయ్యాడు. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో రూపొందించగా బాక్సాఫీస్ వద్ద 24కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

  అదే చివరి హిట్

  అదే చివరి హిట్

  ఇక ఆ సినిమా అనంతరం తరుణ్ ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో డీసెంట్ హిట్స్ అందుకున్నాడు. 2002లో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా నువ్వే నువ్వేతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తరువాత తరుణ్ 2018 వరకు దాదాపు 13 సినిమాలు చేయగా అందులో ఒక్కటి కూడా హిట్టవ్వలేదు.

  తరుణ్ రిజెక్ట్ చేసిన హిట్ మూవీ

  తరుణ్ రిజెక్ట్ చేసిన హిట్ మూవీ

  అసలైతే 2009లో సినిమాలను చేయకూడదని తరుణ్ ఒక నిర్ణయానికి వచ్చాడట. అయితే ఆ సమయంలోనే తరుణ్ ఒక బంగారం లాంటి ఆఫర్ వస్తే చేజేతులారా మిస్ చూసుకున్నాడట. ఆ సినిమా చివరికి అల్లరి నరేష్ దగ్గరికి వెళ్లి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

  ఆ ఎఫెక్ట్ వల్లే..

  ఆ ఎఫెక్ట్ వల్లే..

  ఆ సినిమా మరేదో కాదు అల్లరి నరేష్ నటించిన ఆహా నా పెళ్ళంట. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన వీరభద్రం చౌదరి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని చెప్పాడు. నేను నిర్మాత మొదట తరుణ్ కు కథ వినిపించగా అప్పుడే ఆయన శశిరేఖపరిణయం సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఆ ఎఫెక్ట్ తో తరుణ్ సినిమాలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాట్లు చెప్పాడు.

  Raj Tarun New Movie Will Be Directed By Santo
  ఆ సినిమా చేసి ఉంటే..

  ఆ సినిమా చేసి ఉంటే..

  తరుణ్ రిజెక్ట్ చేయడంతో ఈవివి సత్యనారాయణ సలహా మేరకు అల్లరి నరేష్ తో సినిమాను తెరకెక్కించారు. ఇక ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి త్రిబుల్ ప్రాఫిట్స్ అంధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 100రోజులు సందడి చేసింది. నిజంగా తరుణ్ ఆ సినిమా చేసి ఉంటే బహుశా అతని ఫామ్ లోకి వచ్చి ఉండేవాడేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Along with Uday Kiran, Tarun also received a good craze in Tollywood as a New Lover Boy. Their careers as heroes began almost at the same time. The audience already knows Tarun as a child actor. The hero also started a new life with his personal business, leaving movies behind after a series of setbacks over the years. In fact, in the meantime, Tarun missed a good chance. The matter came out through a recent interview given by a senior director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X