Teja Sajja: ఈ సినిమా నిలబడుతుంది.. మమ్మల్ని నిలబెడుతుంది.. తేజా సజ్జా షాకింగ్ పోస్ట్!
తేజా సజ్జా హీరోగా వచ్చిన తాజా సినిమా హనుమాన్ గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుంటూ అనేక రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు... ట్విట్టర్ వేధికగా అందరికీ థాంక్స్ చెబుతూనే ఉన్నారు. అయితే హీరో తేజ సజ్జా మాత్రం తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. అదేంటో, అసలు ఎందుకు పెట్టాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాలో తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అలాగే వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను జనవరి 12 తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్ గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు.

విజ్యువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందిస్తుండగా... శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే ఎస్. బి రాజు తలారి ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల అయిన ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. టికెట్లు అందుబాటులోకి వచ్చిన కాసేపటికే థియేటర్లు ఫుల్ అయిపోతున్నారు. చాలా చోట్ల థియేటర్లు సరిపోకే ఈ సినిమాకు అనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇదంతా ఇలా ఉండగా.. తెలంగాణలోని వరంగల్ జిల్లా కేంద్రోలని ఓ థియేటర్ వద్ద హనుమాన్ సినిమా భారీ కటౌట్ ను రోడ్డు మీద వదిలేశారు. అది చూసిన దేవిప్రియ అనే ఓ నెటిజెన్ ఫొటో తీసి ఎక్స్ వేధికగా పోస్ట్ చేసింది. దీన్ని ఇప్పుడైనా నిలబెట్టండి అంటూ రాసుకొచ్చింది. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ట్యాగ్ చేసింది. అలాగే హీరో తేజా సజ్జాను కూడా ట్యాగ్ చేయగా ఆయన స్పందించారు. వెంటనే ఆ భారీ కటౌట్ ను మళ్లీ చక్కగా నిలబెట్టించారు. ఆ తర్వాత ఆ ఫొటో హీరో వద్దకు రావడంతో ఆయన మరో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ లో కటౌట్ ను నిలబెట్టిన ఫొటో పెట్టి.. సేమ్ ప్లేస్ అని వివరించారు. అలాగే ఈ సినిమా నిలబడుతుంది.... ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది అంటూ రాసుకొచ్చారు. తాజాగా ఈయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ ఆన్సర్ భయ్యా.. ఆంజనేయ స్వామే మీ సినిమాను ఆడిస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాక్సాఫీసు వద్ద మాస్ బ్యాటింగ్ చేస్తున్న ఈ సినిమా చివరి వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











