Uday Kiran వెండితెరపై మళ్లీ ఉదయ కిరణ్... మరోసారి గుండెల్ని బరువెక్కించేందుకు రెడీ!

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయిన యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. స్వయంకృషితో ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి యువతను ఓ ఊపు ఊపేశారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లి చాలా కాలమే అయినా ఇప్పటికీ ఆయన్ను ఎవరూ మర్చిపోలేదు. అయితే ఇప్పుడాయన మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ కనిపించడం ఏంటని అనుకుంటున్నారా అదేనండీ ఆయన నటించిన ఓ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. దాని గురించే ఈ కథనం..

సినీ ఇండస్ట్రీలోకి దూసుకువచ్చిన ఓ యువ కెరటం ఉదయ్‌ కిరణ్‌. ఆయన వస్తూ వస్తూనే తన సత్తా ఏంతో ఆడియెన్స్ కు రుచి చూపించారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ నిర్మించిన చిత్రం అనే మూవీ పరిచయమైన ఆయన తొలి ప్రయత్నంలోనే భారీ సక్సెస్ ను అందుకున్నారు. అలా తన రొమాంటిక్‌ డ్రామా సక్సెస్ తో ఉషా కిరణ్ సంస్థకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టారు.

Hero Uday Kiran Nuvvu Nenu Movie re-release in theaters on March 21st Full Details Here

అలానే ఆయన యువ హృదయాల కలల రాకుమారుడిగానూ మారిపోయరు. అనంతరం వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌దక్కించుకున్న ఆయన ఆ తర్వాత కలుసుకోవాలని, శ్రీరామ్‌, హొలీ 'నీ స్నేహం, జోడీ నంబర్‌ వన్‌, నీకు నేను నాకు నువ్వు, లవ్‌ టుడే, ఔనన్నా కాదన్నా, వియ్యాలవారి కయ్యాలు, గుండె జల్లుమంది, ఏకలవ్యుడు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, జై శ్రీరామ్‌ చిత్రం చెప్పిన కధ సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

Hero Uday Kiran Nuvvu Nenu Movie re-release in theaters on March 21st Full Details Here

అయితే లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయనకు తన సినీ జర్నీలో వరుస డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అలా ఓ వైపు సినిమా ఆఫర్స్ తగ్గిపోవడం, మరోవైపు వ్యక్తిగత కారణాలు తీవ్ర మానసిక వేదనకు గురి చేయడంతో ఉదయ్ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇది జరిగి చాలా ఏళ్లే అయినా ఆయన్ను ఎవరూ మర్చిపోలేదు.

Hero Uday Kiran Nuvvu Nenu Movie re-release in theaters on March 21st Full Details Here

ఇప్పుడు మళ్లీ ఆయన్ను వెండితెపై చూసేందుకు రెడీ అవుతున్నారు ప్రేక్షకులు. ఆయన సినిమాలు రీరిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. అందులో కల్ట్ క్లాసిక్ హిట్ నువ్వు నేను కూడా ఒకటి. మార్చి 21న మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో అనిత హీరోయిన్ గా నటించింది. ప్రముఖ దర్శకుడు తేజ దీన్ని తెరకెక్కించారు.ప్రముఖ నటుడు సునీల్ ఈ మూవీలో కీలక హాస్య పాత్ర పోషించి తెగ నవ్వించారు. ఆర్ పి పట్నాయక్ సినిమాకు హృదయాన్ని తాకే సంగీతం అందించారు.

Hero Uday Kiran Nuvvu Nenu Movie re-release in theaters on March 21st Full Details Here

అయితే ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. 2001 ఆగస్టు 10న రిలీజైంది. అయినా తొలి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను అందుకుంది. అలాే కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.15 కోట్ల వరకు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X