ప్రాణాలు అక్కడే వదిలెయ్యాలని అనుకున్నా.. వైష్ణవ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్

మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత లాభాన్ని అందిస్తే అంత మంచిది. అందుకే మొదటి సినిమా విషయంలో కొందరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చే హీరోలు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో హిట్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ పైనే పడింది. ఉప్పెన సినిమాతో పరిచయం కాబోతున్న ఈ హీరో వరుసగా ఇంటర్వ్యూలను ఇస్తున్నాడు. ఇక రీసెంట్ గా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాడు.

సినిమాలంటే ఇంట్రస్ట్ లేదట

సినిమాలంటే ఇంట్రస్ట్ లేదట

మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న వైష్ణవ్ తేజ్ కు అప్పుడే 30ఏళ్ళు వచ్చాయి. ఈ హీరోకు మొదట నటనపై పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదట. ఓ వైపు మెగా హీరోలు చకచకా సినిమాలు చేస్తుంటే వైష్ణవ్ మాత్రం ఇంకా రావడం లేదని అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. ఉప్పెన సినిమా కంటే వైష్ణవ్ తేజు కు చాలా ఆఫర్స్ వచ్చయట.

బొమ్మలు కొనిస్తాను అంటేనే..

బొమ్మలు కొనిస్తాను అంటేనే..

ఇక ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నటనపై అయితే పెద్దగా ఆసక్తి లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో పెద్ద మామయ్య వీల్ చేయిర్ లో కదలకుండా కూర్చోవాలి అంటే అలానే ఉన్నా. అంతకుముందు పవన్ కళ్యాణ్ మామయ్య జానీ సినిమాలో కూడా నటించాను. బొమ్మలు కొనిస్తాను అంటేనే ఆ సినిమా చేశాను. అందరివాడులో కూడా నటించాను. ఆ తరువాత మళ్ళీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎందుకో కలగలేదు.

డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా..కానీ..

డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా..కానీ..

ఈ సినిమా చేయడానికి ఒక మూడేళ్ళ ముందు వరకు కూడా ఎన్నో సార్లు నా భవిష్యత్తుపై మధనపడ్డాను. సైంటిస్ట్‌, ఆస్ట్రోనాట్‌ ఇలా చాలా అనుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ కావాలని అనిపించింది. కానీ ఒక్కసారి అన్నయ్య సెట్‌కి వెళ్లి అక్కడి వాతావరణాన్ని చూశాక డైరెక్షన్ అనేది అంత సాధారణమైన విషయం కాదని డ్రాప్ అయ్యా.

ఏం చేయాలో తెలియక..

ఏం చేయాలో తెలియక..

ఇక జ్యూవెలరి డిజైనర్, త్రీడి యానిమేటర్ ఫొటో గ్రాఫర్ ఇలా ఎన్నో నాలో కోరికలను పెంచాయి. కానీ వాటిపై కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఒకానొక సందర్భంలో ఏం చేయాలో తెలియక మా అమ్మతో చెబితే.. సినిమాలు చేయమని సలహా ఇచ్చింది. హీరో అనగానే నాకు భయం వేసేది.

ఆర్మీ కోసం వర్కౌట్స్..

ఆర్మీ కోసం వర్కౌట్స్..

ఫైనల్ గా నా ప్రాణాలు వృధాగా పోవడం ఎందుకు అని దేశానికి ఉపయోగ పడేలా బార్డర్ లో ప్రాణాలు వదిలేస్తే బెటర్ అని అనిపించింది. జిమ్ లోకి వెళ్లి కసరత్తులు కూడా చేశాను. ఆర్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఫిట్నెస్ ముఖ్గ్యమైని నాజుగ్గా మారిపోయాను కూడా. ఇక ఒక షేప్ వచ్చిన తరువాత రెండు మూడు ఫొటోపాను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను.

మామయ్య అలా.. చెప్పడంతో..

మామయ్య అలా.. చెప్పడంతో..

అలా ఫొటోలను పోస్ట్ చేశానో లేదో వెంటనే రెండు సినిమాల ఆఫర్స్ వచ్చాయి. చిరు మామయ్యకు ఆ విషయం చెప్పడంతో.. ముందు వచ్చిన అవకశాలను గౌరవించాలని అన్నారు. ఒకవేళ నీరూపించుకోకపోతే అప్పుడు నీకు ఇష్టమైన దారిని ఎంచుకో.. అంటూ మామయ్య మంచి సలహా ఇచ్చారు. అప్పుడే ఉప్పెన ఆఫర్ రావడంతో వెంటనే ఒకే చేశాను.. అని వైష్ణవ్ తేజ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X