Varun Sandesh: శ్రద్ధాదాస్‌ ప్రేమలో వరుణ్ సందేశ్.. భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో చెప్పిన వరుణ్!

హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా మారిన వరుణ్ సందేశ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈయన హీరోయిన్ వితికా షేరును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న వరుణ్ సందేశ్.. హీరోయిన్ శ్రద్ధా దాస్ తో తన ప్రేమాయణం గురించి వివరించారు. అలాగే భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. తన భార్య వితికా షేరులో తనకు నచ్చని విషయాల గురించి కూడా వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2007లో అంటే తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తొలి సినిమా చేసిన ఈయన ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా కొత్త బంగారు లోకం, ఎవరైనా ఎపుడైనా, కుర్రాడు, మరో చరిత్ర, హ్యాపీ హ్యాపీగా, ఏమైంది ఈవేళ, కుదిరితే కప్పు కాఫీ, బ్రమ్మిగాడి కథ, ప్రియుడు, చమ్మక్ చల్లో, ప్రియతమా నీవచట కుశలమా, సరదాగా అమ్మాయితో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఢి ఫర్ దోపిడీ, నువ్విలా నేనిలా, ఈ వర్షం సాక్షిగా, పడ్డానండి ప్రేమలో మరి, మామ మంచు కల్లుడు అంచు, మిస్టర్ 420, మర్లపులి, నువ్వు తోపురా, ఇందువదన, మైఖేల్, ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు చిత్రం చూడారా, యద్భావం తద్భవతి వంటి సినిమాలు చేశాడు.

Hero Varun Sandesh Reveal His Relation With Shraddha Das Check Details

ప్రస్తుతం నింద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే రీతూ చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ అనే షోలో పాల్గొన్నాడు. అక్కడే తన గురించి అనేక విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా తన భార్య వితికా షేరులో తనకు నచ్చని విషయాలు గురించి చెప్పుకొచ్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకు కూడా అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు వస్తాయని తెలిపాడు. ముఖ్యంగా తన భార్య తన బ్రష్, టవల్ వంటివి వాడుతుందని.. దాని వల్ల తనకు చాలా కోపం వస్తుందని వెల్లడించారు. అలాగే ఆమె పడే కష్టం దగ్గర ఉండి చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను.. తాను చాలా కష్టపడి పని చేస్తుందంటూ వివరించారు.

మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సంపాదిస్తారని అనగా... ఇద్దరం అని చెప్పాడు. అయితే తనకు సినిమాలు వచ్చినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని, తనకు నెల నెలా వస్తాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఛాలా సంతోషంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చాడు. అయితే గతంలో మీరు హీరోయిన్ శ్రద్ధాదాస్ తో ప్రేమలో ఉన్నారని, బ్రేకప్ కూడా అయింది వార్తలు వచ్చాయి వాటిలో నిజం ఎంత ఉందని రీతూ చౌదరి అడగ్గా.. నాకు పెళ్లి అయి 8 సంవత్సరాలు అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మాకు గొడవలు పెట్టొద్దంటూ వివరించాడు.

గతంలో తాము కలిసి సినిమాలు చేశామని.. ఇప్పుడు ఎవరి జీవితం వారిది అంటూ వివరించాడు. ఇది చూస్తుంటేనే వారిద్దరూ ప్రేమాయణం సాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ చాలా కాలం కావడం.. ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉండడం వల్ల దాని గురించి మాట్లడకపోవడమే బెటర్ అని సైలెంట్ గా ఉంటున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చాడు. పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ షో పూర్తిగా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X