twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో వెంకటేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇప్పుడు వచ్చే రెమ్యునరేషన్ చిల్లరతో సమానం!

    |

    సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా అనేది పర్మినెంట్ కాదని అందరికి తెలిసిన విషయమే. ముందు జాగ్రత్తగా ఉండకపోతే ఒక్క రోజులోనే జీవితాలు తిరగబడిపోతాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రం రొటీన్ అయినప్పటికి సినిమా ఇండస్ట్రీలో అదే బెస్ట్ లైన్. అందుకే ఎవరైనా సరే టైమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. కొందరు మాత్రం వంద రాళ్లు వెనకేసుకుంటారు. అందులో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఆస్తుల విలువతో పోలిస్తే ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఒక చిల్లరతో సమానమని చెప్పవచ్చు.

    ఇతర బిజినెస్ లలో పెట్టుబడి పెడుతూ

    ఇతర బిజినెస్ లలో పెట్టుబడి పెడుతూ

    రంగుల ప్రపంచంలో స్టార్ హీరోల మార్కెట్ అనేది గ్యారెంటీ కాదు. వరుసగా రెండు మూడు సినిమాలు డిజాస్టర్ అయితే రెమ్యునరేషన్ రేటు ఒక్కసారిగా తగ్గిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. వచ్చిన దాంట్లో ఒక రూపాయిని ఇతర బిజినెస్ లలో పెట్టుబడి పెడుతూ లాభాలను అందుకుంటూ ఉంటారు. అదే తరహాలో వెంకటేష్ కూడా తన ఆదాయాన్ని పెంచుకున్నాడు.

    అయిష్టంగానే ఎంట్రీ ఇచ్చాడు

    అయిష్టంగానే ఎంట్రీ ఇచ్చాడు

    సీనియర్ నిర్మాత డీ.రామయనాయుడు తనయుడైన వెంకటేష్ హీరో కాకముందే కోటీశ్వరుడు. మొదట ఆయన సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. ఎప్పుడు బిజినెస్ చేయాలనే ఆలోచనలతో ఉండేవారట. అయితే అప్పటికే అన్నయ్య సురేష్ బాబు నిర్మాతగా రానిస్తుండడంతో నువ్వైనా హీరోగా రావాలని తండ్రి కోరడంతో మొదట్లో అయిష్టంగానే ఎంట్రీ ఇచ్చాడు.

     పవర్ఫుల్ కనిపించి

    పవర్ఫుల్ కనిపించి

    అప్పటి హీరోలు చాలా వరకు ఫిట్నెస్ విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఒక విదంగా వెంకటేష్ మాత్రమే బాడీ పెంచి పవర్ఫుల్ కనిపించి బిగ్ స్క్రీన్ పై హీట్ పెంచేవారు. మెల్లగా లవ్ స్టోరీల నుంచి బలమైన మాస్ సినిమాల వరకు వచ్చారు. ఒకవైపు చంటి, రాజా లాంటి సెన్సిటివ్ సినిమాలు చేస్తూనే మరోవైపు గణేష్, జయం మనేదేరా వంటి హై వోల్టేజ్ సినిమాలు కూడా చేసుకుంటూ వచ్చారు.

    ఆయన అండతోనే లాభాలు

    ఆయన అండతోనే లాభాలు

    ఇక మెల్లగా తన రెమ్యునరేషన్ డోస్ ను పెంచుకుంటూ వెళ్లిన వెంకటేష్ వచ్చిన దాంట్లో సగం దాచుకుంటూ మరో సగం రియల్ ఎస్టేట్స్ లలో ఇన్వెస్ట్ చేసేవారు. అన్నయ్య సురేష్ బాబు అలాంటి బిజినెస్ లలో ఎప్పుడో రాటు దేలారు. ఆయన అండతోనే లాభాలు వచ్చే ప్రతి బిజినెస్ లలో పాట్నర్ గా బిజినెస్ చేసుకుంటూ వచ్చారట.

    వెంకటేష్ మొత్తం ఆస్తుల విలువ

    వెంకటేష్ మొత్తం ఆస్తుల విలువ

    ఇక మెల్లగా వెంకటేష్ ఆస్తి విలువ వేల కోట్లకు దాటినట్లు టాక్. ఇప్పటివరకు చూసుకుంటే వెంకటేష్ మొత్తం ఆస్తుల విలువ 2వేల కోట్లకు పైగానే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. అంటే ఆ ఆస్తులతో పోలిస్తే వెంకటేష్ కు వచ్చే రెమ్యునరేషన్ చిల్లరతో సమానమని చెప్పవచ్చు.

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    ప్రస్తుతం వెంకటేష్ ఒక్కో సినిమాకు 8కోట్ల వరకు ఛార్జ్ చేస్తిన్నట్లు సమాచారం. నిజానికి వెంకీ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తను కూడా ఒక నిర్మాత కొడుకే కావున నష్టాలు వస్తే తిరిగేచ్చేసిన సందర్బాలు కూడా ఉన్నాయట. ఇక ప్రస్తుతం ఈ హీరో F3, నారప్ప, దృశ్యం 2 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

    English summary
    Venkatesh, who was slowly increasing his remuneration dose, hid half of what he got and invested the other half in real estate. elder brother Suresh Babu has never been involved in such business. He will continue to do business as a partner in every business that makes a profit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X