Marriage: స్టార్ హీరో కూతురి పెళ్లికి ముహుర్తం ఫిక్స్... వరుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించబోతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మరోవైపు కీరవాణి చిన్నకుమారుడు.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమార్తె పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ అబ్బాయి ఎవరు... ఏం చేస్తాడు.. పెళ్లి ఎప్పుడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సెలబ్రేటీల ఇంట్లో పెళ్లంటే... సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగా ఇంట పెళ్లి సందడి మొదలు అయింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి పెద్దలు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటలీలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇప్పటికే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ బయలుదేరింది. అంతే కాదు.. అక్కడి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇక నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉండనుందని సమాచారం.

మరోవైపు ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి రెండో కొడుకు పెళ్లంటూ ప్రచారం మొదలైంది. శ్రీసింహ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు. ఈ కుర్ర హీరో.. మురళి మోహన్ మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇక వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అది ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్. ఆయన రెండో కూతురి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. వెంకటేష్ రెండో కూతురు హయవాహిని పెళ్లి చేసేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ సిద్ధం అయినట్లు సమాచారం. ఇక ఎంగేజ్మెంట్ కి కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది.

వెంకటేష్ కు మొత్తం నలుగురు సంతానం. అందులో ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. ఇప్పటికే పెద్ద కూతురు ఆశ్రీత పెళ్లి జరిగి చాలా కాలం అయింది. ఇప్పుడు వెంకీ తన రెండో కూతురిని అత్తారింటికి పంపేందుకు రెడీ అయ్యాడు. అయితే వరుడు ఎవరు అనే కదా మీ సందేహం. అతను విజయవాడకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక వారు డాక్టర్ ఫ్యామిలీ అని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది వీరి పెళ్లి చేయనున్నారని ఇన్ సైడ్ టాక్.
దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి సందడికి ప్రముఖులతో పాటు... అక్కినేని కుటుంబం కూడా హాజరు కానుంది. అతి కొద్దిమంది సమక్షంలో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఇక వెంకటేష్ కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. ఆయన ఫ్యామిలీ గురించి పెద్దగా ఇండస్ట్రీకి తెలియదు. పైగా తన ఫ్యామిలీ నుండి ఎవరిని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు వెంకటేష్. ప్రస్తుతం రెండో కూతురి పెళ్లి పనులలో వెంకటేష్ బిజీ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక పెళ్లి కూతురు హియవాహిని ఓ అథ్లేట్ అని సమాచారం.


Click it and Unblock the Notifications











