Hero Venkatesh: రానా నాయుడు వెబ్ సిరీస్ ను మళ్లీ తీసుకొస్తారట, ఆ సీన్ల గురించి చెప్పిన వెంకీ మామ

వెంకటేశ్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వస్తున్న మూవీ సైంధవ్. జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా రాబోతోంది ఈ సినిమా. ఈ మూవీ టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు. తండ్రీ కుమార్తెల సెంటిమెంట్ తో వస్తున్న ఈ మూవీ టీజర్ మంచి టాక్ అందుకుంటోంది. వెంకీ సూపర్ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. టీజర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రానా నాయుడు వెబ్ సిరీస్ తో తనపై వచ్చిన విమర్శలపైనా వెంకటేశ్ స్పందించారు.

సైంధవ్ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని, ఆ నమ్మకం తనకు ఉందని అన్నారు వెంకటేశ్. సంక్రాంతి సమయంలో వస్తున్న సైంధవ్ ను తెలుగు ప్రేక్షకులు విశేషంగా అలరించి హిట్ చేస్తారని అన్నారు వెంకీ. కలియుగ పాండవులు సినిమాతో మొదలైన తన సినీ కెరీర్ లో తనను ఎంతో మంది ప్రోత్సహించారని, ఆదరించారని చెప్పుకొచ్చారు.

Hero Venkatesh Shocking Comments on Rana Naidu Web Series Next Season

తన కెరీర్ లో సైంధవ్ మూవీ 75వ చిత్రమని చెప్పిన వెంకీ.. ఇక్కడి వరకు ప్రయాణం చేయడం కేవలం తెలుగు సినీ ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యం అయిందని చెప్పారు. తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకూ ఎలాంటి డల్ మూమెంట్ లేదన్న వెంకీ.. సైంధవ్ మూవీ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు.

కొన్ని రోజులుగా చాలా మంది తన వద్దకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ ఎంటర్‌టైనర్స్ తో వచ్చారని, కానీ శైలేశ్ కొలను చెప్పిన సైంధవ్ మూవో తనకు అద్భుతమైన కథగా అనిపించినట్లు చెప్పారు. ఇందులో న్యూ స్టైల్ ఆఫ్ యాక్షన్ కు స్కోప్ ఉందని భావించి ఈ కథకు ఓకే చెప్పినట్లు తెలిపారు. సైంధవ్ మూవీలో ఉన్న భావోద్వేగాలతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, సినిమాను చాలా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు వెంకటేశ్ పేర్కొన్నారు. సైంధవ్ సినిమాలో తన పాత్ర చాలా వైల్డ్ గా, క్రేజీగా ఉంటుందని, యూత్ తో పాటు ఫ్యామిలీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారని వెంకీ అన్నారు. ఈ సినిమాతో కొత్త వెంకీని చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Hero Venkatesh Shocking Comments on Rana Naidu Web Series Next Season

సినిమా టీజర్ లో వినిపించిన సైకో పదంపైనా వెంకీ క్లారిటీ ఇచ్చారు. సైంధవ్ సినిమాలో తన పేరు సైంధవ్ కోనేరు అని, అందుకే తనను సైకో అని పిలుస్తారని చెప్పుకొచ్చారు. సైంధవ్ అనే పేరును హీరో పాత్రకు తగ్గట్లుగా పెట్టినట్లు చెప్పారు.

సైంధవ్ మూవీకి సీక్వెల్ ఉంటుందా అన్న రిపోర్టర్ల ప్రశ్నకు వెంకీ సమాధానం ఇస్తూ.. ప్రేక్షకులు ఆదరిస్తే ఉంటుందని, లేకపోతే ఉండదని చెప్పుకొచ్చారు. సైంధవ్ తో పాటు సంక్రాంతి బరిలో నిలిచిన మహేశ్ బాబు చిత్రం గుంటూరు కారం మూవీపై వెంకటేశ్ మాట్లాడారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో పెద్దోడు, చిన్నోడు వస్తే సూపరి హిట్ అని తేలిపోయిందన్నారు. పండక్కి ఇద్దరి సినిమాలు విడుదల కావడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తన కోసం స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నాయని, రానా నాయుడు 2 కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు వెంకీ. రానా నాయుడు సిరీస్ మంచి ఆదరణ అందుకుందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తనను గుర్తిస్తున్నట్లు చెప్పారు వెంకీ. రానా నాయుడు హిందీ వెర్షన్ తో పోలిస్తే.. తెలుగులో ఆ కంటెంట్ ను చాలా తగ్గించామని, భవిష్యత్తులోనూ ఇంకా తగ్గించి రానా నాయుడు 2 తీసుకువస్తామని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X