రష్మికతో ఫిబ్రవరిలో నా నిశ్చితార్థం, పెళ్లి.. అసలు విషయాలు చెప్పి షాకిచ్చిన విజయ్ దేవరకొండ!

గత కొంతకాలంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లి గురించి నెట్టింట పెద్ద చర్చే సాగుతోంది. ఆనన నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను పెళ్లి చేసుకోబోతున్నారని, అది కూడా సీక్రెట్ గా అంటూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు వార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరిలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని అదే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ చెప్పుకు వస్తున్నారు. అయితే తొలిసారిగా ఈ వార్తలపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అసలు విషయాలు చెబుతూ.. రష్మికతో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, కలిసే తిరుగుతున్నారంటూ ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన విషయాలను హైలెట్ చేస్తుంటారు. గీతా గోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. విపరీతంగా రొమాన్స్ సీన్లలో నటించడం, కిస్సులు, హగ్గులతో రెచ్చిపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలతో పాటు సెపరేట్ గా దిగిన ఫొటోలకు కూడా లింక్ లు పెడుతూ నెటిజెన్లు సెన్షేషన్ క్రియేట్ చేస్తుంటారు.

 Hero Vijay Devarakonda Clarrity About His Marriage With Rashmika Mandanna in February

అయితే కొత్త సంవత్సరం 2024లో అడుగు పెట్టినప్పటి నుంచి కొత్త ఏడాదిలో వీరి పెళ్లి చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పది రోజుల క్రితం అయితే ఫిబ్రవరిలోనే వీరు నిశ్చితార్థం చేసుకోబోతున్నారని.. అలాగే అదే నెలలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇటు హీరో విజయ్ కానీ అటు రష్మక కానీ స్పందిస్తే తప్ప క్లారిటీ రాదంటూ వివరించాయి. అయితే తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఈ వార్తలపై స్పందించారు.

ఫిబ్రవరిలో తన ఎంగేజ్ మెంట్, పెళ్లి జరగట్లేదని క్లారిటీ ఇచ్చేశారు. ముఱ్యంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి తన పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లు ఉన్నాయంటూ వివరించారు. ఎప్పటికప్పుడు వాళ్లంతా తన చుట్టూనే తిరుగుతూ... దొరికిన వెంటనే పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ప్రతీ ఏడాది ఇలాంటి రూమర్ వింటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పట్లో వీరి పెళ్లి ఉండదని అర్థం అవుతుంది.

 Hero Vijay Devarakonda Clarrity About His Marriage With Rashmika Mandanna in February

ఇదంతా ఇలా ఉండగా... విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే ఆయన జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి VD12 సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి కూడా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X