Vijay Deverakonda: నేను లవ్ మ్యారేజీయే చేసుకుంటాను.. కానీ ఓ షరతు!

రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో తొలిసారి తనలోని అసలైన కోణాన్ని చూపించి అందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి ఈయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈయనను కలవాలని, ఫొటో దిగాలని, హగ్ చేసుకోవాలని.. ఇలా అనేక రకాల కోరికలతో అమ్మాయిలు తెగ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు.

ఇక ఈయనను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న అమ్మాయిల సంఖ్యకు అయితే లెక్కే ఉండదేమో. ఎంతో మంది హాట్ ఫేవరెట్ హీరో అయిన ఈయన తాజాగా తన పెళ్లిపై స్పందించారు. తాను ప్రేమ పెళ్లే చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ ఓ షరతు ఉందని వివరించారు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్నా గురించి కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hero Vijay Devarakonda Said That He Will Do Love Marriage Check Details

విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా సినిమానే ఫ్యామిలీ స్టార్. పరుశురాం డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ థాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ విడుదల కాగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పాటలు కూడా అదిరిపోయాయి. ఇప్పటికే వచ్చిన మూడు పాటలకు తెగ రెప్సాన్స్ వచ్చింది.

ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేందుకు బాగానే ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీం. తాజాగా హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ దిల్ రాజ్, డైరెక్టర్ పరుశురామ్ లు.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడు వెళ్లారు. అక్కడే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ.. కెరియర్ లో దూసుకు వెళ్తున్న మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని రిపోర్టర్లు అడగ్గా.. నాక్కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ.

అయితే అంతా అనుకున్నట్లుగా 2024లో తాను పెళ్లి చేసుకోవట్లేదని.. కానీ త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడిని అవుతానని చెప్పాడు. అలాగే లవ్ మ్యారేజీయా, అరేంజ్డ్ మ్యారేజీయా అని అడగ్గా.. ఫుల్ బ్లష్ అవుతూ ప్రేమ వివాహమే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. ఇంత గ్లో ఏంటి.. అని రిపోర్టర్లు అడగ్గా మరోసారి సిగ్గు పడిపోయాడు హీరో విజయ్ దేవరకొండ. తాను చేసుకునేది లవ్ మ్యారేజీయే అయినా ఆ అమ్మాయి తనకు తల్లిదండ్రులకు కూడా నచ్చాలని చెప్పాడు.

Hero Vijay Devarakonda Said That He Will Do Love Marriage Check Details

మీరు తర్వాత సినిమా ఎవరితో చేస్తారని మరో రిపోర్టర్ అడగ్గా.. మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని అదే రిపోర్టర్ ను తిరిగి అడిగాడు హీరో విజయ్. ఇందుకు ఆమె నా ఫేవరెట్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అని చెప్పగా.. తాను ఆహీరోయిన్ తోనే సినిమా చేస్తానని చెప్పాడు. రష్మికతో మంచి కథ చేస్తానంటూ వివరించాడు. ఇలా తన గురించి, తన పెళ్లి గురించి అదిరిపోయే విషయాలు చెప్పగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X