ప్రేయసితో అడ్డంగా దొరికేసిన హీరో విశాల్.. కెమెరాను చూసి అలా పరార్!

తమిళ హీరో విశాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన కథలతో అనేక సినిమాలు చేస్తూ... సినీ ప్రియులను అలరించే ఈయనకు తెలుగులోనూ చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అచ్చమైన తెలుగు అబ్బాయి అయిన ఇతడు చెన్నైలో సెటిల్ అయి అక్కడే ఎక్కువగా చిత్రాలు చేస్తున్నాడు. కానీ ఈయన నటనకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడంతో ఎక్కువ చిత్రాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. కేవలం నటుడిగానే కాకుండా తన సొంత నిర్మామ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించాడు యంగ్ హీరో.

అభిమానులు అంతా విశాల్ అని పిలుచుకునే ఈయన పూర్తి పేరు విశాల్ కృష్ణా రెడ్డి. ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కనీసం ఈయనకు ప్రేయసి కూడా లేదు. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తో ఈయన ప్రేమాయణం సాగిస్తున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా మరికొంత మంది పేర్లు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికీ సింగిల్ గానే ఉంటూ ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటున్న ఈయన.. తాజాగా ఓ అమ్మాయితో కలిసి కనిపించాడు. ఈ వీడియో నెట్టింట ఫల్ వైరల్ గా మారింది. అయితే అందులో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Recommended Video

Hero Vishal Video.. ఎవరా హీరోయిన్ ? | Telugu Filmibeat

Hero Vishal Going With One Girl on The Road Video Goes Viral

హీరో విషాల్ రెడ్ కలర్ హుడీ వేసుకుని ఓ రోడ్డుపై వెళ్తూ కనిపించారు. పక్కేనే ఓ అమ్మాయి కూడా ఉంది. అయితే వాళ్ల రోడ్డుపై వెళ్తుండగా... ఎవరో వీరిని గుర్తించారు. వీడియో తీస్తూ... ఏయ్ విశాల్ అని పిలిచారు. తనను పిలవగానే షాక్ అయిన విశాల్ వీడియో తీస్తున్న విషయం గుర్తించి తలపై ఉన్న క్యాప్ ను వేసేసుకున్నారు. అమ్మాయిపై చేయి వేసి ఆమె మొహం కనిపించకుండా చేతులు అడ్డు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన చాలా మంది పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే అమ్మాయిలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు కదా అంటూ కొంత మంది, ఈమైనా నీ ప్రేయసా లేక వేరే అమ్మాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే కావాలనే ఈ స్టంట్ చేస్తున్నావు కదా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా చేసి జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఏదో, ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

Hero Vishal Going With One Girl on The Road Video Goes Viral

ఇదంతా ఇలా ఉండగా... విశాల్ ప్రస్తుతం హరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. పూర్తి మాస్ యాక్షన్ తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఈ సినిమాను తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు హైప్ పెంచేందుకు విశాల్ ఇలాంటి స్టంట్లు చేస్తున్నారేమో అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి విశాల్ ఈ వీడియోపై ఏం మాట్లాడతారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X