Hero Vishal: గుడ్‌న్యూస్ చెప్పిన హీరో విశాల్.. పాతికేళ్ల కళ అలా తీరబోతుందట!
తమిళ హీరో విశాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన కథలతో అదిరిపోయే సినిమాలు చేస్తూ అందరినీ అలరించే ఈయనకు తెలుగులోనూ అనేక మంది అభిమానులు ఉన్నారు. పుట్టి పెరిగింది అంతా ఇక్కడే అయినా చెన్నైలో సెటిల్ అయ్యాడీ కుర్రహీరో. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తన పాతికేళ్ల కళ నెరవేరబోతున్నట్లు వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అభిమానులు అంతా విశాల్ అని పిలుచుకునే ఈయన పూర్తి పేరు విశాల్ కృష్ణా రెడ్డి. ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అయితే ఈయన పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుకార్లు వస్తుండగా... ఈయన మాత్రం పట్టించుకోకుండా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటూ ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ కుర్ర హీరో ఓ ట్వీట్ చేశాడు.

ముఖ్యంగా తన పాతికేళ్ల కళ నెరవేరబోతుంందటూ హీరో విశాల్ ఎక్స్ వేధికగా వెల్లడించాడు. తన కళ, తన ఆకాంక్ష, తాను జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాను అనే మొదటి ఆలోచన ఇప్పుడు నిజం కాబోతుందని పేర్కొన్నాడు. తన కెరియర్ లో అత్యంత సవాలుతో కూడిన కొత్త బాధ్యతలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. అది మరేదో కాదు.. దర్శకుడి బాధ్యత అని చెప్పాడు. అంటే తాను డైరెక్టర్ గా మారబోతున్నట్లు ప్రకటించాడు.
ముఖ్యంగా తన డైరెక్షన్ లో రాబోతున్న మొదటి సినిమా తుప్పరివాలన్ 2, డిటెక్టివ్ 2 సినిమా కోసం లండన్, అజర్ బైజాన్, మాల్టాలకు వెళ్లబోతున్నట్లు వివరించాడు. ఇది అభిమానులతో పంచుకోవడానికి మాటలు సరిపోవడం లేదని తెలిపారు. అలాగే తన తండ్రి జీకే రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ సార్ చెప్పినట్లు.. హార్డ్ వర్క్ ఎప్పుడూ విఫలం కాదని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాము కన్న కళలు నెరవేర్చుకోవడానికి కష్టపడడం ఆపకూడదని తెలిపారు.
అలాగే నటుడిగా తనకు సపోర్ట్ చేసిన తన అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తుప్పరివాలన్ 2, డిటెక్టివ్ 2 సినిమాకు కూడా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నానంటూ హీరో విశాల్ వెల్లడించాడు. డైరెక్టర్ గా మారాలనుకున్న తన కళను ఇంత త్వరగా తీర్చేలా చేస్తున్న మిస్కిన్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. డిటెక్టివ్ సినిమాను డైరెక్ట్ చేసింది ఈయనే. పార్ట్ 2కు మాత్రం హీరోగా, డైరెక్టర్ గా హీరో విశాల్ ఉండబోతున్నారు.


Click it and Unblock the Notifications











