Vishwak Sen: మా సినిమాని లేపమని అడగలేదు.. అభినందించమని మాత్రమే అడిగా!

యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రియులకు అందరికీ తెలిసిందే. అద్భుతమైన యాక్టింగ్ చేసే ఈయన అదిరిపోయే సినిమాలతో వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈయన గామి సినిమాతో వచ్చి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా ఈయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన మా సినిమాను కూడా నలుగురు చూడాలి అంటూ చెప్పిన విషయాలపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

వీటిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తుండగా.. అసలు విషయాన్ని మరోసారి వివరించాడు హీరో విశ్వక్ సేన్. తాను ఏ ఉద్దేశంతో అన్నాడు, ఏమన్నాడో కూడా చెప్పుకొచ్చాడు. తాను తన సినిమాను లేపమని సినీ పెద్దలను అడగలేదని.. కేవలం సినిమాను అభినందించమని మాత్రమే అడిగానంటూ ఎక్స్ వేధికగా క్లారిటీ ఇచ్చాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hero Vishwak Sen Clarification About He Ask to Industry People to Push His Film Check Details

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన తాజా సినిమానే గామి. ఈ సినిమాను విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేయగా.. యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అలాగే అభినయ, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు కూడా నటించి మెప్పించగా.. మార్చి 8వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా చిత్రబృందంతో పాటు తిరుపతి వెళ్లిన విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్లు చేశారు. చాలా కష్టపడి, రిస్క్ చేసిన ఈ సినిమా తీశామని.. ఈ సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ఇది మన తెలుగు చిత్రం అని ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదని గర్వంగా చెబుతానంటూ వివరించాడు.

Hero Vishwak Sen Clarification About He Ask to Industry People to Push His Film Check Details

అయితే విశ్వక్ సేన్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా సినిమా చూసి దానికి సపోర్ట్ చేయాలని, లేపాలని అడిగాడంటూ చాలా మంది వార్తల్లో రాసుకొచ్చారు. అవన్నీ చూసి విశ్వక్ తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. తాను తన సినిమాను సపోర్ట్ చేయమని, లేపమని చెప్పలేదని.. కేవలం చూసి మాట్లాడితే బాగుంటుందని మత్రమే అన్నానని వివరించాడు.

ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు ఇలా అడిగి ఉంటే లేపమని సపోర్ట్ చేయమని అడిగినట్లు ఉండేదని.. కానీ హిట్ అయ్యాకా అడిగితే చూసి సపోర్ట్ చేయమని మాత్రమే అర్థం అని అందరికీ అర్థమయ్యేలా క్లారిటీ ఇచ్చాడు. అలాగే తాను ఈ సినిమాలో టెక్నీషియన్లు అంతా కొత్త వాళ్లు అని.. ప్రశంసించబడడానికి వాళ్లు అర్హులు అనేదే తన ఉద్దేశం అని వివరణ ఇచ్చాడు. ఇది గామి ప్రారంభం మాత్రమేనని తెలుగు సినీ చరిత్రలో ఇది నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X