పోస్టర్లు చింపేశారు, తొక్కేయాలని చూస్తున్నారు: ‘ఫలక్‌నుమా దాస్’ హీరో విశ్వక్ సేన్

'ఫలక్‌నుమా దాస్' మూవీ తెలంగాణ నేపథ్యంలో తీసినప్పటికీ ఆంధ్రాలో కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుందని నటుడు, దర్శకుడు విశ్వక్ సేన్ తెలిపారు. సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడలో ఈ చిత్ర బృందం మీడియాతో సమావేశమైంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ రెండు ప్రాంతాల్లో మా సినిమాకు పోటాపోటీగా ఆదరణ లభిస్తుందని తెలిపారు.

తరుణ్ భాస్కర్ చెప్పినట్లు కళ బావుంటే అది భాష, యాసను దాటేస్తుంది. వైజాగ్‌లో ఓ థియేటర్ సందర్శించినపుడు అందరు ఫ్యామిలీస్ సినిమాను బాగా ఎంజాయ్ చేయడం చూశాను. విజయవాడ శకుంతల టాకీసులో వెళ్లినపుడు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. బౌన్సర్లు ఉన్నప్పటికీ అభిమానుల మీద పడటంతో కాలికి దెబ్బకూడా తగిలిందని విశ్వక్ సేన్ గుర్తు చేసుకున్నారు.

కొందరు నాపై కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు

కొందరు నాపై కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు

మా సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో భాగంగా నా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పెట్టాను. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి కొందరు కావాలని నా సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయినా వారి కామెంట్లు పట్టించుకోకుండా జనం సినిమా ఆదరిస్తున్నారని విశ్వక్ సేన్ తెలిపారు.

మీడియా వారిని ఏమీ అనలేదు

మీడియా వారిని ఏమీ అనలేదు

హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ల సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇస్తూ... సినిమా బాలేదని కామెంట్ చేసిన వారిపై విశ్వక్ సేన్ బూతుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై స్పందిస్తూ ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటారు.. ఆ నేచర్ నాకు కాస్త తక్కువగా ఉంది. నేను ఏదో కోపంతో మాట్లాడిన దాన్ని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది నా పర్సనల్ వీడియో. మీడియాను ఉద్దేశించి ఏమీ అనలేదు. రివ్యూలకు కొంతమంది తక్కువ రేటింగ్ ఇచ్చినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరి టేస్ట్ వారిదని లైట్ తీసుకున్నట్లు తెలిపారు.

ఏ హీరోను అనలేదు

ఏ హీరోను అనలేదు

ఆడియో లాంచ్ సమయంలో మాట్లాడిన మాటలు ఒక హీరోను ఉద్దేశించి అని అంతా అనుకుంటున్నారు. నేను ఏ హీరోను ఉద్దేశించి అనలేదు. ఆ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు అని ఈ సందర్భంగా విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. కాగా... విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినవే అనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది.

నా పోస్టర్లు చించేశారు

నా పోస్టర్లు చించేశారు

సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంతో పాటు హైదరాబాద్‌లో నా పోస్టర్లు కూడా చింపేశారు. విషయం అంత వరకు వచ్చినపుడు బాధ అనిపించింది. నాకు యాంటీగా ఉండొచ్చు, నా సినిమాకు యాంటీగా ఉండొచ్చు. కానీ నా పోస్టర్ చించి వేస్తే బాధగా ఉండదా? అందుకే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీని గురించి మాట్లాడుతూ ఒక బూతు పదం మాట్లాడాను. దాని వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే సారీ చెబుతున్నాను... అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

సరైన దారిలో వచ్చి నాతో తలపడండి

సరైన దారిలో వచ్చి నాతో తలపడండి

ఈ సినిమాలో 80 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చాను. నేను హీరో అవుదామని సినిమా తీస్తే అదే 5 కోట్లు పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా తీసేవాడిని. నాతో పాటు పది మంది పైకి రావాలని నా స్నేహితులతో కలిసి ఈ సినిమా తీశాను. అలాంటి నన్ను కాలు పట్టుకుని కిందకు లాగుదామంటే... తేల్చుకోవడానికి నేను రెడీ, కాకపోతే రైట్ రూట్లో వచ్చి నాతో ఫైట్ చేయండి.. అని విశ్వక్ సేన్ సవాల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X