Vishwak Sen: "ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. అతడంత గట్టిగా నేను తొడ కొడతా"
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనను కనబర్చి.. అంతకు మించిన సూపర్ స్టోరీస్ తో ప్రేక్షకులు ముందుకు వస్తుంటాడీ కుర్రహీరో. వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన గామితో సూపర్ సక్సెస్ సాధించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన అభిమాన హీరో గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా ఆయన ఇండియాలోనే అతిగొప్ప నటుడు అని.. అతడంత గట్టిగా తాను తొడ కొట్టగలనని చెప్పాడు. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
2017లో వెళ్లిపోమాకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత కూడా అనేక సినిమాలు చేశాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్, ఆశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం, హిట్ 2, దాస్ కా ధమ్కీ, బూ, గామి సినిమాలు చేశాడు. ఇటీవలే వచ్చిన గామి సూపర్ డూపర్ హిట్ కొట్టగా.. అదే ఊపులో తన నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు.

అలాగే ఈ చిత్రంలో విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ చిత్రాన్ని మే 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగానే హీరో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగాతన అభిమాన హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చారు. తన అభిమాన హీరోను చూస్తే.. ఇండియాలోనే అతి గొప్ప నటుడిగా తనకు ఆయన కనిపిస్తారని.. ఆయనలా యాక్టింగ్ చేసేందుకు తాను ఎంతగానో కృషి చేస్తానని వివరించారు.
అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యంగ్ టైగర్ చాలా గట్టిగా తొడ కొడతారని.. ఆయనంత గట్టిగా మళ్లీ విశ్వక్ సేన్ కూడా కొట్ట గలుగుతున్నాడని తెలిపాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ తొడ కొట్టడాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారని వివరించారు. మరి మే 17వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











