ఆ పరిస్థితే వస్తే ప్రభాస్‌తోనే ఉంటా.. హాట్ బ్యూటీ బోల్డ్‌గా జవాబు
సౌత్ సినిమా దగ్గర ఒకింత బోల్డ్ నెస్ ని కనబరిచే హీరోయిన్స్ తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. కాగా మొదట్లో కొందరు సింపుల్ గానే ఎంట్రీ ఇస్తారు కానీ ఉండగా ఉండగా తమ లోని హాట్ నెస్ ని పెంచుతూ వెళుతుంటారు. కాగా వారికి భిన్నంగా కొందరు బ్యూటీస్ అయితే ముందు నుంచే తమలోని అందాలు చూపిస్తూ కుర్రకారుని ఊపేస్తారు.
మరి ఇలాంటి హీరోయిన్స్ ఎక్కువగా హిందీ మార్కెట్ లో కనిపిస్తారు కానీ మన సౌత్ లో కూడా ఒక హీరోయిన్ ఉంది. మరి ఆ హీరోయిన్నే మాళవిక మోహనం. తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ డస్కీ లుక్స్ లో కనిపిస్తూ మంచి బోల్డ్ నెస్ ని కనబరుస్తుంది. ఇలా సౌత్ నుంచి హిందీ సినిమాకి కూడా మాళవిక మోహనన్ విస్తరించింది.

అయితే తమిళ్ సహా తెలుగులో ముందే సినిమాలు చేసిన ఈ హాట్ బ్యూటీ ఇపుడు తెలుగు సినిమాలో ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. తన తొలి సినిమాగా పాన్ ఇండియా స్టార్ లాంటి బిగ్ స్టార్ సరసన నటించే ఛాన్స్ ని కొట్టేసింది. కాగా ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఉందని వచ్చిన రూమర్స్ తో తెలుగు ఆడియెన్స్ లో బాగా వైరల్ అయ్యింది.
ఇక ఇదిలా ఉండగా ఆ వార్తలు తర్వాత తన డెబ్యూ సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కలయికలో చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ "ది రాజా సాబ్" ని లాక్ చేసుకుంది. కాగా ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ చేయగా ప్రభాస్ అంటే చాలా సార్లు అమితమైన అభిమానాన్ని తాను కనబరిచింది. ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ ఇంటరాక్ట్ కాగా ఆమెకి నెటిజన్స్ నుంచి ఒక క్రేజీ ప్రశ్న ఎదురైతే దానికి తాను కూడా అంతే క్రేజీ ఆన్సర్ ఇచ్చేసింది.
సినిమాల్లో మనం జాంబీ జానర్ సినిమాలు కూడా చూసే ఉంటాం. హాలీవుడ్ లో బాగా ఫేమస్ కానీ మన ఇండియన్ సినిమా దగ్గర తక్కువే వచ్చాయి. అయితే జాంబీ కాన్సెప్ట్ లో ఒక ఊరు ఊరంతా లేదా ఒక దేశమే జాంబీలతో నిండిపోతుంది. మరి అలాంటి సమయంలో జాంబీ వైరస్ సోకని మనుషులు కూడా ఉంటే వారు బతికేది ఎలా? కాగా ఇలాంటి పరిస్థితి మాళవికకి ఎదురైతే మీరు మీ కో స్టార్స్ లో ఎవరితో ఉండాలి అనుకుంటారు అనే ప్రశ్నకి వెంటనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరు చెప్పేసింది ఈ హాట్ బ్యూటీ..
ప్రభాస్ గారు ఎందుకంటే తన దగ్గర ఎప్పుడూ రుచికరమైన ఆహారం ఉంటుంది. సో అలాంటి జాంబీ సమయంలో కూడా ఆకలి కోసం ఆలోచించకుండా ఉండాలి అంటే ప్రభాస్ తోనే ఉంటాను అంటూ క్రేజీ ఆన్సర్ అందించింది. దీనితో ఈ సమాధానం డార్లింగ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక ఈ ఇద్దరూ నటిస్తున్న ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











