NTR 30 పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఆసక్తిగా ఉన్నాను అంటూ కామెంట్
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా కొరటాల శివ ఒక పవర్ఫుల్ పాన్ ఇండియా కథను కూడా రెడీ చేసుకున్నాడు. కానీ కొరటాల శివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో మళ్ళీ ఒక్కసారిగా వారి ఆలోచన విధానం మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రం రిస్కు తీసుకోకూడదు అని శివకు ప్రత్యేకంగా సూచనలు కూడా ఇచ్చినట్లు సమాచారం.
పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ కథలో చాలా వరకు మార్పులు కూడా చేసినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది. అసలైతే ఈ ప్రాజెక్టు జూలై నెలలోనే మొదలు కావాలి కానీ వివిధ రకాల చర్చల అనంతరం ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ దాదాపు సెలెక్ట్ అయింది అని చాలాసార్లు ఒక టాక్ అయితే వినిపించింది.

మొదట ఆలియా భట్ అని ఆ తర్వాత శ్రద్ధా కపూర్ అని ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే అలియా భట్ మొదట ఓకే చెప్పినప్పటికీ మళ్లీ ఆమె వెనుకడుగు వేసింది. ఇక రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లు ఒక టాక్ అయితే గట్టిగా విడిపించింది. ఇక రీసెంట్గా ముంబైలో రష్మిక తన తదుపరి ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడిగినప్పుడు రష్మిక అప్పుడే మీకు ఎలా తెలిసింది అని ఇంకా అఫీషియల్ గా కూడా చెప్పలేదు అని అన్నారు.
కానీ నిజంగానే ఆ ప్రాజెక్టు చేయడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నాను అని కూడా ఆమె ఒక హింట్ అయితే ఇచ్చేసింది. ఇక రష్మిక మందన్న దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది. ఇక రష్మిక నటించిన గుడ్ బై అనే సినిమా హిందీలో శుక్రవారం విడుదల కాబోతోంది. అమితాబచ్చన్ అందులో మరొక ముఖ్యమైన పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











