Adivi Sesh:హిట్ 2 టీజర్ డిలీట్.. చూడాలంటే కండిషన్స్, అడవి శేష్ రియాక్షన్ ఏంటంటే?

సరికొత్తగా కథలను రాసి తానే నటిస్తూ హిట్ కొడుతున్న యంగ్ హీరో అడవి శేష్. ఈ హీరో ఎక్కువగా క్రైమ్ అండ్ థ్రిల్లర్ సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. క్షణం, ఎవరు వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఈసారి రచయితగా కాకుండా కేవలం హీరోగా అడవి శేష్ వస్తున్న చిత్రం హిట్ ది సెకండ్ కేస్. డైరెక్టర్ సైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ హిట్ వర్స్ ఫ్రాంఛైజీలో అడవి శేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో 9 మిలియన్ వ్యూస్ తో పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. అయితే తాజాగా హిట్ 2 చిత్రబృందానికి యూట్యూబ్ షాక్ ఇచ్చింది.

మొదటి సినిమా అయినా..

మొదటి సినిమా అయినా..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన చిత్రం హిట్ (HIT: The First Case). నాచురల్ స్టార్ నాని నిర్మాతగ వ్యవహరించిన ఈ చిత్రంతో శైలేష్ కొలను దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నిజానికి శైలేష్ కొలను ఒక డాక్టర్. సినిమాలపై ఉన్న ఆసక్తితో డైరెక్టర్ అయ్యారు. చేసింది మొదటి సినిమా అయినా సూపర్ హిట్ కొట్టారు.

సీక్వెల్ ఉంటుందని హింట్..

సీక్వెల్ ఉంటుందని హింట్..

2020లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ "హిట్: ది ఫస్ట్ కేస్" మంచి ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా హిందీలో కూడా ఇదే పేరుతో విడుదలైంది. అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో ఈ సినిమా వచ్చినప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. అందుకనుగుణంగానే ఇప్పుడు "హిట్: ది సెకండ్ కేస్" ను తీసుకువచ్చారు. ఈ సెకండ్ కేస్ లో హీరోగా అడవి శేష్ నటించాడు.

డిఫరెంట్ యాటిట్యూడ్ తో

డిఫరెంట్ యాటిట్యూడ్ తో

ఇటీవల విడుదల చేసిన ఈ సీక్వెల్ మూవీ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ యాటిట్యూడ్ తో అడవి శేష్ నటన ఆకట్టుకుంది. సెటైరికల్ అండ్ ఇంటెన్షనల్ పోలీస్ ఆఫీసర్ గా దర్శనమిచ్చాడు అడవి శేష్. టీజర్ మొత్తం ఫన్నీగా సాగిన చివర్లో ఓ క్రైమ్ సీన్ తో సూపర్బ్ థ్రిల్లింగ్ ఇచ్చారు. టీజర్ చూస్తే ఫస్ట్ మూవీకి మించి క్రైమ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే..

18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే..

హిట్ 2 టీజర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగింది. కానీ, తాజాగా హిట్ 2 చిత్రబృందానికి యూట్యూబ్ షాక్ ఇచ్చింది. హిట్ వర్స్ ఫ్రాంఛైజీలో వస్తున్న ఈ హిట్ 2 టీజర్ ను యూట్యూబ్ ట్రెండంగ్ జాబితా నుంచి డిలీట్ చేసింది. అలాగే పలు ఆంక్షలు కూడా విధించింది. ఈ టీజర్ ను 18 ఏళ్లు నిండిన వాళ్లే చూసే విధంగా వయసు పరిమితి పెట్టారు. టీజర్ చివరిలో రక్తపాతం, క్రైమ్ సీన్ దారుణంగా ఉండటంతో యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది.

అనుకున్నట్లే జరిగింది..

అయితే యూట్యూబ్ ఇలా చేయడంపై ముందే ఊహించాను అని చెప్పాడు హీరో అడవి శేష్. ఈ విషయంపై స్పందించిన అడవి శేష్ మాట్లాడుతూ ''మా డైరెక్టర్ శైలేష్ కొలను టీజర్ నాకు చూపించగానే ఈరోజు వస్తుందని అనుకున్నాను. అనుకున్నట్లే జరిగింది. హిట్ 2 టీజర్ ను ట్రెండింగ్ లిస్ట్ నుంచి యూట్యూబ్ తీసేయడమే కాకుండా ఏజ్ రిస్ట్రిక్షన్ చేశారు. టీజర్ చూసేందుకు సైన్ ఇన్ చేసి 18 ఏళ్లు వయసున్న వాళ్లని ప్రూవ్ చేసుకుంటే తప్పా టీజర్ ను చూడలేరు.

ట్వీట్స్ లో కూడా పెట్టాం..

ట్వీట్స్ లో కూడా పెట్టాం..

వయెలెన్స్ కదా.. సినిమాకు అదే కరెక్ట్. పిల్లలు చూడొద్దని మేం ట్వీట్స్ లో కూడా పెట్టాం'' అని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్ నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X