SSRMB29: మహేశ్‌బాబుతో ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్..అదిరిపోయిన రాజమౌళి స్కెచ్!
SSMB29 Update: సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29గా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భారీ బడ్డెట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. ఈ మూవీలో సూపర్ స్థార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అంటూ.. ఈ మూవీలో హాలీవుడ్ హాట్ బ్యూటీ, ఆస్కార్ విన్నింగ్ లీడ్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తోంది.
మహేష్ బాబు - రాజమౌళి సినిమా గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ గా తెరకెక్కనున్నది. పలు క్రేజీ అప్డేట్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు భారీ పూర్తి చేసారని తెలుస్తోంది. అలాగే.. మహేష్ బాబు లుక్ కూడా చాలా డిఫెరెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన లాంగ్ హెయిర్.. లైట్ గా గడ్డం పెట్టినట్టు ఇటీవల కాలం ఫోటోల్లో కనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ కనపడని రీతిలో ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నారని టాక్.

అలాగే.. ఈ మూవీ 18 శతాబ్దంలో జరిగే కథ అని, పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ మూవీలో అధిక భాగం అడవుల్లో షూటింగ్ జరుగుతుందనీ, ఇదో ఫారెస్ట్ ఎడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీ అరుదైన గిరిజన జాతికి సంబందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, వారికి సంబంధించిన కాస్ట్టూమ్స్ కూడా డిజైన చేయించబోతున్నారు. ఈ తరుణంలో వందలాది జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇలాంటి భారీ గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరలవుతుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ క్రేజీ మూవీలో హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత జెన్నిఫర్ లారెన్స్ ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్టు సమచారం. ఈ బ్యూటీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డ్‌తో సహా పలు నటనా పురస్కారాలు అందుకున్నారు. 2006లో తన 14 ఏండ్లలో బాలనటి సీని ప్రస్థానం ప్రారంభించింది. 2013 లో ఆమె టైమ్స్ ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో జాబితా చోటుదక్కించుకుంంది. అలాగే.. 2015, 2016లో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఈ బ్యూటీ నిలిచింది. సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రకారం.. లారెన్స్ ఒక్కొక్క సినిమాకు
$6 మిలియన్లకు పైగా వసూలు చేస్తుందట.

ఇదెలా ఉంటే.. ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం. అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే.. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











