Ram Charan ఇది గ్లోబల్ వైడ్‌గా రామ్ చరణ్ క్రేజ్.. హాలీవుడ్ నిర్మాణ సంస్థ బిగ్ అనౌన్స్మెంట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. సినిమా సినిమాకు తన లుక్స్ మారుస్తూ, నటనలో మరింత మెరుగుపడుతూ స్టార్ హీరోగా ఎదిగారు. ఇక గతేడాది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో మెగా పవర్ స్టార్‌గా ఉన్న ఆయన ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మారి తన క్రేజ్ పరిధిని మరింత పెంచుకున్నారు . ఈ చిత్రంలో రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా తన పర్ఫెక్ట్ లుక్ అండ్ సూపర్ యాక్టింగ్‌తో హాలీవుడ్ దర్శకనిర్మాతల్ని, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించి ప్రముఖ హాలీవుడ్ సంస్థ ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసి బిగ్ సర్ప్రైజ్ చేసింది. దీంతో మెగా అభిమానులు మరోసారి కాలర్ ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే. రామ్ చరణ్ ఇప్పుడీ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నారు. ఆ తర్వాత ఆరెంజ్, రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ.. ఇలా పలు కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. కానీ ఆ తర్వాత ధ్రువ చిత్రంతో రూటు మార్చి అనంతరం రంగస్థలంతో తనలోని పూర్తి ప్రతిభను బయటకు పెట్టి ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. మెగా అభిమానులతో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంలో చెర్రీ నటనకు ఫిదా అయిపోయారనే చెప్పాలి.

అనంతరం వినయ విధేయ రామతో పరాజయాన్ని అందుకున్న చరణ్ ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ చేసి బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లను సాధించారు. పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ఆయన ఇమేజ్‌ను మరింత మార్చేసింది. అప్పటి వరకు టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ఒక్కసారి సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ రేంజ్లో పాకింది. హాలీవుడ్ ప్రేక్షకులంతా చరణ్ కటౌట్, నటనకు ఫిదా అయిపోయారు.
హాలీవుడ్ మీడియా అయితే చెర్రీ పేరును జపం చేసింది. అక్కడ మీడియా చరణ్ ఇంటర్వ్యూలు కోసం పోటీ పడ్డారు. అక్కడి దర్శకనిర్మాతలు సైతం.. రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా చరణ్ చేసిన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలకు రామ్ చరణ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ కొనియాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా గ్లోబల్ వైడ్‌గా రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది.
ఏకంగా అక్కడి ప్రముఖ కాస్టింగ్ సైట్ ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసింది. ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. అందుకోసం ఊదాహరణగా హాలీవుడ్ ఐకానిక్ పాత్రలను చూపించింది. వాటితో పాటే ఆర్ఆర్ఆర్లోని రామ్‌చరణ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌ను కూడా చూపించింది.

మరి అలాంటి ఐకానిక్ రోల్స్ మధ్య రామ్ చరణ్ స్థానం దక్కించుకున్నారంటే గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అనౌన్స్మెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది చూసిన చరణ్ అభిమానులు.. అది హాలీవుడ్లో చరణ్ క్రేజ్ అంటూ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











