NTR30: మొదట్లోనే యాక్షన్ ఎపిసోడ్స్.. రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్స్!
RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సినిమా అనుకున్న ముహూర్తం మరి ఏమిటో తెలియదు కానీ ఎన్నిసార్లు ప్రారంభించాలని ప్రయత్నించినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ముందుగా కథ నచ్చకపోవడంతో అనేక సార్లు కరెక్షన్స్ చేయించారు.
ఫిబ్రవరిలో ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఖాయం అనుకుంటున్న సమయంలో తారకరత్న మృతి చెందడంతో మరోసారి ఈ సినిమా షూట్ వాయిదా పడింది. ఇక రేపు ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయలుదేరి వెళ్లబోతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరగబోతున్న ఆస్కార్ అవార్డులో వేడుకకు ఆయన హాజరు కాబోతున్నారు. ఈ వేదిక మీద లైవ్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుండగా అదేమీ లేదని మరో ప్రచారం జరుగుతోంది. ఇందులో క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఆ సంగతి పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి రాగానే ఎన్టీఆర్ 30 మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. శంషాబాద్ లో ఉన్న ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ సినిమా కోసం ప్రత్యేక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ జరగబోతున్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని సినిమా కోసం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
అయితే ఎవరు ఏమిటి అనే విషయాల మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ త్వరలోనే వారెవరు అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ మార్కెట్ భారీగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ కి కూడా ఎన్టీఆర్ కాస్త ఎక్స్ పోజ్ అవడంతో ఏదైనా ఇంటర్నేషనల్ ఓటీటీకి ఇంగ్లీష్ వర్షన్ డబ్బింగ్ హక్కులు అమ్మిన హాలీవుడ్ లో కూడా బాగానే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారట. అందుకే హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దించుతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











