twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నానీ వద్దన్నాడు... దుల్కర్ కుదురుకున్నాడు....

    |

    దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ లుటెనెంట్ రామ్ గా తెలుగువారినీ అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలై మంచి రెస్పాన్సే రాబట్టుకుంది. అయితే, ఇదంతా నేచురల్ స్టార్ నానీ తృటిలో మిస్ అయ్యాడని తెలుస్తోంది.

    ఇంతకూ విషయం ఏమిటంటే, తొలుత ఈ కథను నానీకే వినిపించాడట హను రాఘవపూడి. అయితే కథ అంత సంతృప్తికరంగా లేకపోవడంతో పాటూ, ఇతర కారణాల వల్ల నానీ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. దీంతో మళ్లీ కథపై కొన్ని కసరత్తులు చేసి అదే స్క్రిప్ట్ ను మాడిఫై చేసిన హను, దుల్కర్ సల్మాన్ కు వినిపించగా, అబ్బాయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అలా నానీ చేతిలో నుంచి లుటెనెంట్ రామ్ చేజారిపోయింది.

    How Dulquer replaced Nani in Lieutenant Ram!

    వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న లుటెనెంట్, 1964కు చెందిన ఓ ప్రేమకథ అని తెలుస్తోంది. యుధ్ధం నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చుతున్నాడు. మరి నానీ చేజారిన ఈ సినిమా దుల్కర్ కు కలసివస్తుందేమో చూడాలి.

    English summary
    Dulquer Salman replaces actor Nani as Lieutenant Ram, As the later rejected Hanu Raghavapudi's script. The director on the other hand, revived the script and got approved by Dulquer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X