Brahmamudi బ్రహ్మముడికి మానస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు ఎన్ని లక్షల పారితోషికమంటే?
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఇటీవల కాలంలో బాగా పరిచయమైన నటుడు మానస్ నాగులపల్లి. బుల్లితెరపై యువ హీరోల్లో తనకంటూ ఓ ఇమేజ్‌ను, గుర్తింపును తెచ్చుకొంటూ దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు, ఇటు టెలివిజన్ సీరియల్స్‌తో ఆకట్టుకొంటున్నాడు. ఆయన నటించిన బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సిరియల్‌లో నటించినందుకు మానస్ అందుకొంటున్న రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..
చిన్నతనం నుంచే మానస్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. డ్యాన్సులు, యాక్టింగ్‌లోనే కాకుండా చదువుల్లో కూడా ఫస్ట్. టాప్ స్టూడెంట్‌గా మార్కులు సాధించి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రశంసలు అందుకొన్నాడు. డ్యాన్సుల్లో ఇరుగదీసి.. అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్నాడు. బాల్యం నుంచే చదువు, ఆటపాటల్లో విశేషంగా రాణిస్తున్నాడు.

ఇక మానస్ బాల నటుడిగా 2001లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన యువ నటుడు.. క్షీరసాగర మథనం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు.
ఇక తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మానస్ మరింత పాపులారిటీ సాదించాడు. బిగ్‌బాస్‌లో తన ఆట తీరుతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా వారి అభిమానాన్ని సాధించాడు. ఈ రియాలిటీ షో మానస్‌ను కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ షో తర్వాత మానస్‌కు భారీ ఆఫర్లు వచ్చాయి. నటుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ సీరియల్స్‌లో ఒకటైన బ్రహ్మముడి సీరియల్‌తో మానస్ మాస్ ఫాలోయింగ్‌ను అందుకొంటున్నాడు. మానస్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాడు. ఇండస్ట్రీలో టాప్ యాక్టర్లలో ఒకడు అనే విధంగా మానస్ ఇమేజ్‌ను సొంతం చేసుకొంటున్నాడు.

ఇక బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ పాత్రలో నటించినందుకు గాను భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నాడు. ఈ ధారావాహికలో నటించిన ఆయనకు ప్రతీ రోజు 30 వేల రూపాయల పారితోషికాన్ని అందుకొంటున్నట్టు తెలుస్తున్నది. ఇక నెలలో సుమారుగా 20 నుంచి 25 పనిచేసే ఆయనకు మొత్తంగా 7 నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











