ప్రభాస్ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంత? కల్కికి పారితోషికం ఎంత తీసుకున్నారో తెలుసా?

సౌత్ నుంచి నార్త్ దాకా ఇప్పుడు ఓ భాషలోని ప్రేక్షకులైనా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయమే అక్కరలేదు. చిన్నపిల్లాడిని ప్రశ్నించినా సరే ప్రభాస్ ఎవరో టక్కున గుర్తుపడతారు. దేశవ్యాప్తంగా మంచి నటుడిగా ఇంతటి గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 150 కోట్ల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న ఈ స్టార్ హీరో తన ఫస్ట్ మూవీకి ఎంత పారితోషకం తీసుకున్నాడో ఓ లుక్కేద్దాం పదండి.

రెబల్ స్టార్ అంటే భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వానికి కోట్లాది మంది అభిమానులు ఫిదా అయిపోయారు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి వరుస పరాజయాలను చూసినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా సలార్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు రెబల్ స్టార్. దీంతో ఆయన క్రేజీ మరింతగా పెరిగిపోయింది.

How much remuneration Prabhas gor for his first movie

అయితే సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఎలా పెరుగుతుందో దానికి తగ్గట్టే రోజురోజుకూ ఆయన రెమ్యూనరేషన్ అమాంతం పెరుగుతోంది. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. నిజానికి ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కల్కి 2898 కూడా ఒకటి. రెబల్స్ ఎంతగానో ఎదురు చూసిన ఈ మూవీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చి కలెక్షన్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది.

ఇక సలార్ కోసం ప్రభాస్ దాదాపు 120 కోట్లు, కల్కి కోసం 150 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు అని టాక్ నడుస్తోంది. ఇలా ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ తన ఫస్ట్ మూవీకి మాత్రం కేవలం నాలుగు లక్షలే పారితోషికంగా తీసుకున్నారు. 2002లో ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. జయంత్ దర్శకత్వం వహించిన ఈశ్వర్ మూవీ 2002 నవంబర్ 11న రిలీజ్ అయింది.

How much remuneration Prabhas gor for his first movie

ఈ మూవీ సూపర్ హిట్ కాకపోయినప్పటికీ ప్రభాస్ కు మాత్రం మంచి పేరే వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించింది. తను ఫస్ట్ సినిమాకు నాలుగు లక్షలు మాత్రమే పారితోషకంగా అందుకున్నానని ప్రభాస్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బుజ్జిగాడు, యోగి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి.. ఇలా హిట్స్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.

అయితే 2015లో రిలీజ్ అయిన బాహుబలి మూవీతో ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రయాణం గురించి పాన్ ఇండియా మూవీ లవర్స్ అందరికీ బాగా తెలుసు. మొత్తానికి ఇప్పుడు కల్కి మూవీ హిట్ అవ్వడంతో ప్రభాస్ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ చేతిలో ఆరడజను సినిమాలు ఉండడం విశేషం.

More from Filmibeat

Read more about: prabhas kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X