ఫ్యాన్సే షాకయ్యేలా బాలయ్య వారసుడు .. మోక్షజ్ఞ మేకోవర్ వెనుక అంత కష్టం ఉందా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై ప్రతిసారి ఊరించి ఊసూరుమనిపిస్తూ ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. అయితే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనులను బాలయ్య ఎప్పుడో మొదలుపెట్టారు. కథల ఎంపిక, దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపారు. తాజాగా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు . సింబా ఈజ్ కమింగ్ అంటూ పోస్ట్ పెట్టి మోక్షజ్ఞ లుక్‌ను విడుదల చేశారు. క్యూట్ లుక్‌లో , అందరినీ మెస్మరైజ్ చేశారు మోక్షజ్ఞ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు.. ఈ సినిమాతో బాలకృష్ణ కుమారుడు హీరోగా, చిన్న కుమార్తె తేజస్విని కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి రెండో ప్రాజెక్ట్స్‌గా రానున్న ఈ సినిమాని ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని మతుకుమిల్లి సంయుక్తంగా నిర్మించనున్నారు. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ఫిలింనగర్ టాక్. హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని తీసుకొచ్చే పనిలో చిత్రయూనిట్ ఉంది.

How Nandamuri Balakrishna s Son Mokshagna Transformation For Prasanth Varma Movie here s the details

అన్నింటిలోకి చెప్పుకోవాల్సింది మోక్షజ్ఞ తేజ మేకోవర్ గురించే. బయట పెద్దగా కనిపించకపోవడంతో మోక్షజ్ఞ పాత ఫోటోలే చాలా వరకు చక్కర్లు కొట్టేవి. కొన్నేళ్ల క్రితం మోక్షజ్ఞ తన కుటుంబంతో కలిసి ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫోటోల్లో బాగా లావుగా కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ షాకయ్యారు. ఇలా అయితే హీరో ఎప్పుడవుతాడు, అసలు హీరోగా ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశం బాలయ్యకి ఉందా లేదా అన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.

ఈ నేపథ్యంలోనే కొడుకు లుక్‌ను మార్చాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్స్‌య్యారట. తన వారసుడి డెబ్యూ ఆషామాషీగా ఉండకూడదనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి సమయాన్ని ఖర్చు చేయడానికి బాలకృష్ణ వెనుకాడలేదు. అందుకు తగ్గట్లుగానే పర్సనల్ ట్రైనర్లతో పాటు నటన, ఇతర విభాగాల్లో కుర్రాడిని రాటు తేల్చేందుకు స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దించారట. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి మోడ్రన్ లుక్‌లో , స్టైలిష్‌గా ఉన్న మోక్షజ్ఞ లుక్ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దానికి కొనసాగింపుగా తాజా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మోక్షజ్ఞ లుక్ అదిరిపోవడంతో ఈ జనరేషన్ హీరోల్లో బాలయ్య కొడుకు అందగాడిగా నిలిచాడు. మిగిలిన హీరోల వారసులు మాస్ సినిమాలతో తమ కెరీర్ స్టార్ట్ చేయగా.. బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞని సోషియో ఫాంటసీ మూవీతో తెలుగుతెరకు పరిచయం చేయాలని నిర్ణయించారు.

How Nandamuri Balakrishna s Son Mokshagna Transformation For Prasanth Varma Movie here s the details

హనుమాన్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఇందుకోసం బాలయ్య- ప్రశాంత్ వర్మ కలిసి ఓ స్టోరీని కూడా సిద్ధం చేశారు. త్వరలోనే మోక్షజ్ఞ తేజ మూవీ పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో బాలయ్య వారసుడు కూడా తాత, తండ్రి, అన్నయ్యల బాటలోనే స్టార్ హీరోగా వెలుగొందాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సో ఆల్ ది బెస్ట్ టూ నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X