హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్ బయోపిక్.. షాకిచ్చేలా ఓవర్సీస్ డీల్!
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రారంభమైనప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదల చేస్తున్న ఫస్ట్ లుక్స్ తో అభిమానుల్లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి ఉత్కంఠ పెరుగుతోంది.
ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా చంద్రబాబు పాత్రలో స్టార్ హీరో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఏఎన్నార్ పాత్రలో హీరో సుమంత్ నటిస్తున్నాడు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి నెలకొన్న క్రేజ్ దృష్ట్యా ఓవర్సీస్ రైట్స్ భారీ ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తుంది.

ప్రముఖ పంపిణీదారుడితో ఓవర్సీస్ లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి 10 కోట్ల డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు భారీ డిమాండ్ నెలకొని ఉంది. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ జీవితంలోని మధుర ఘట్టాలన్నింటినీ అద్భుతంగా చిత్రీకరిస్తునట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











