షాకిస్తున్న యంగ్ హీరో సినిమా బడ్జెట్!
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటనకు మంచి స్పందన వస్తోంది. నటన, నృత్యం, పోరాటాలలో బెల్లంకొండకు మంచి మార్కులు పడుతున్నాయి. కానీ ఈ యంగ్ హీరోకు సరైన కమర్షియల్ హిట్ దక్కడం లేదు. ఈ యువ హీరో చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నా.. ప్రతి చిత్రం భారీ బడ్జెట్ లో రూపొందుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన గత చిత్రం సాక్ష్యం. ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది కానీ కమర్షియల్ గా నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీనివాస్ ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీనివాస సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని 40 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్, మెహ్రీన్ కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నేనే రాజు నేనే మంత్రి వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత తేజ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











