twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లాప్ సినిమాలతో రామ్ మిలియన్ల సక్సెస్.. దెబ్బకు 'రెడ్' రేటు పెరిగింది!

    |

    హై వోల్టేజ్ ఎనర్జీతో కనిపించే అతికొద్ది మంది టాలీవుడ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. కెరీర్ లో విజయాల కంటే అపజయలే ఎక్కువగా ఉన్నప్పటికీ అతనికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రామ్ కేవలం క్లాస్ సినిమాలే చేస్తాడని వచ్చిన కామెంట్స్ కి ఇస్మార్ట్ శంకర్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా రామ్ కెరీర్ కి మరో మంచి బూస్ట్ ఇచ్చింది.

    హిందీలో రామ్ హవా..

    హిందీలో రామ్ హవా..

    మన స్టార్ హీరోల కంటే కూడా మీడియం హీరోలే హిందీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. అసలైతే మన మాస్ హీరోల సినిమాలంటే నార్త్ జనాలకు చాలా ఇష్టం. అందుకే యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో వ్యూస్ అందుకుంటాయి. ఇక హిందీలో డబ్ అయిన రామ్ సినిమాలు టీవీలలో ప్రసరమైనా కూడా మంచి క్రేజ్ అందుకుంటూ ఉంటాయి. సక్సెస్ అయిన వాటిలో కేవలం మాస్ సినిమాలనే కాకుండా మిగతా లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి.

    ఇస్మార్ట్ రికార్డ్..

    ఇస్మార్ట్ రికార్డ్..

    రామ్ పోతినేనికి సంబంధించిన ఏ సినిమా అయినా సరే హిందీ ఆడియెన్స్ అమితంగా ఆదరిస్తున్నారు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ హిందీలో డబ్ అయ్యి శాటిలైట్ మరియు యూట్యూబ్ లో కూడా మంచి రిజల్ట్ అందుకుంది. యూ ట్యూబ్ లో ఈ సినిమా 100 మిలియన్ల వ్యూవ్స్ ని అందుకుంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో రామ్ సరికొత్త రికార్డ్ అందుకున్నారు.

    ప్లాప్ సినిమాలు కూడా హిట్టే..

    ప్లాప్ సినిమాలు కూడా హిట్టే..

    రామ్ ఇస్మార్ట్ శంకర్ కంటే ముందు చేసిన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగి సినిమాలు తెలుగులో ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయినప్పటికీ హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా 100మిలియన్లకు పైగా వ్యూవ్స్ ని అందుకుంటున్నాయి. అలాగే నేను శైలజా కూడా అదే రేంజ్ లో హిట్టయ్యింది.

    'రెడ్' రేటు పెంచేశారు..

    'రెడ్' రేటు పెంచేశారు..

    రామ్ పోతినేని సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఏర్పడడంతో తదుపరి సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రేటు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రామ్ రెడ్ సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల కోసం 9కోట్లను ఆఫర్ చేయగా.. చిత్ర యూనిట్ 12కోట్లు చెప్పిందట. అయినప్పటికీ ఆ సంస్థ రామ్ సినిమాను దక్కించుకోవడానికి రెడీ అవుతోంది. రామ్ మార్కెట్ రేంజ్ ని చూస్తుంటే భవిష్యత్తులో డైరెక్ట్ గా హిందీ స్క్రీన్ పై మెరిసే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.

    English summary
    Hindi audiences are keenly watching any film related to Ram Pothineni. Recently Ismart Shankar has dubbed in Hindi and received good results on Satellite and YouTube too. The film has received over 100 million views on YouTube. Ram has set a new record with Puri Jagannath Direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X