పవన్ బాక్సాఫీస్ హవా.. ఇది ఆరంభం మాత్రమే, అంతకుమించి అనేలా హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ పవర్ ఏ స్థాయిలో ఉంటుందో వకీల్ సాబ్ తో మరోసారి ఋజువయ్యింది. అసలు పవన్ అభిమానులు కోరుకున్నది ఇలాంటి సినిమా కాదు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టడం విశేషం. చూస్తుంటే రానున్న రోజుల్లో పవన్ తన బాక్సాఫీస్ స్థాయిని మరింత పెంచుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అందరిచూపు హరిహర వీరమల్లు పైనే ఉంది.

ప్లాప్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ..

ప్లాప్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో విజయాల కంటే అపజయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్మాతలకు ఆయన మార్కెట్ వాల్యూపై ఒక ఐడియా ఉంది. పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమాలు తీస్తే హిట్టు కొట్టవచ్చో దర్శకులకు కూడా ఒక ఐడియా ఉంది. అందుకే పవర్ స్టార్ డేట్స్ దొరికితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సినిమాలను స్టార్ట్ చేసేస్తారు.

అది సినిమలైనా.. రాజకీయాలైనా..

అది సినిమలైనా.. రాజకీయాలైనా..

రాజకీయాల్లో ఎవరు ఊహించని ఓటమి ఎదురైనా కూడా మళ్ళీ అక్కడే స్థిరంగా పోరాటం చేయడం పవన్ ఒక్కడికే సాధ్యమయ్యింది. రిజల్ట్ సంగతి పక్కన పెడితే పవన్ ఫామ్ లోకి వస్తే తిరుగుండదు అనేది అందరికి తెలిసిన విషయమే. అది సినిమలైనా.. రాజకీయాలైనా..! ఇక పవన్ వకీల్ సాబ్ హిట్టు తరువాత అంతకుమించి అనేలా మరొక సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

అభిమానులు కోరుకున్న సినిమా ఇది కాదు

అభిమానులు కోరుకున్న సినిమా ఇది కాదు

పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ అసలు అభిమానులు కోరుకున్న సినిమా కాదు. కానీ సినిమాలో మాస్ ఎలివేషన్స్ అక్కడక్కడా టచ్ చేయడం వలన అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. పెద్దగా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ లేని సినిమాతో పవన్ 100కోట్ల వసూళ్లను అందుకున్నాడు అంటే ఇక హిస్టారికల్ యాక్షన్ కథతో వస్తే కలెక్షన్స్ సునామీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే అర్ధమయ్యింది

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే అర్ధమయ్యింది

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా 17వ శతాబ్దంలోని చారిత్రాత్మక అంశాల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాను 120కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా దర్శకుడు క్రిష్ తక్కువ బడ్జెట్ , తక్కువ సమయం ఉంటేనే సినిమాను ఒక రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే ఆ విషయం బాగా అర్ధమయ్యింది.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
వార్ సీన్స్ పై స్పెషల్ ఫోకస్

వార్ సీన్స్ పై స్పెషల్ ఫోకస్

ఇక పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో అత్యదిక బడ్జెట్ ఇస్తే క్రిష్ ఆలోచనలను అందుకోవడం ఎవరికి సాధ్యం కాదు. హరిహర వీరమల్లు తప్పకుండా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా సాలీడ్ గా ఉంటాయట. దర్శకుడు పవన్ స్టామినాకు తగ్గట్లు భారీ యుద్ధ సన్నివేశాలను కూడా చూపించబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X