అన్న హెల్ప్ చేయలేదు, నీ దారి నీదే అన్నాడు: ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అతడు రాజు అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1980 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవిత రెండో కుమార్తె శివాత్మిక నటిస్తుంది. '

ఇప్పటి వరకు జరిగిన 'దొరసాని' మూవీ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించలేదు. కనీసం తమ్ముడి సినిమా టీజర్, పోస్టర్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. తన స్నేహితుడు నవీన్ పొలిశెట్టి మూవీ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రమోషన్‌కు రావడంతో పాటు టీజర్ షేర్ చేసిన విజయ్... అదే రోజు విడుదలైన 'దొరసాని' టీజర్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మీ అన్నయ్య ఎందుకు నీ సినిమా ప్రమోట్ చేయడం లేదు అనే ప్రశ్నకు ఆనంద్ వివరణ ఇచ్చారు.

అన్నయ్య హెల్ఫ్ చేయనని చెప్పాడు

అన్నయ్య హెల్ఫ్ చేయనని చెప్పాడు

సంవత్సరం క్రితం అన్నయ్యకు ఈ సినిమా గురించి చెప్పి.. నేను సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నట్లు చెప్పాను. నా చదువుకి, అమెరికాలో చేసిన మాస్టర్స్‌కు ఇది పూర్తిగా విభిన్నమైనది. ఇలా ఎవరూ చేయరు. అపుడు విజయ్ ఒకటే చెప్పాడు. సినిమా రంగంలో నీ దారి నువ్వే చూసుకో అన్నాడు. నా హెల్ప్ ఏమీ ఉండదు... అని చెప్పినట్లు ఆనంద్ తెలిపారు.

నా సహాయం లేకుండా ఎదుగు అన్నాడు

నా సహాయం లేకుండా ఎదుగు అన్నాడు

‘‘నేను నిన్ను ఈ దారిలోకి లాగినట్లు ఉండకూడదు. నీకు అన్నీ సెటప్ చేసి, ఇన్‌ఫ్ల్యూయెన్స్ చేసి, ఒక డైరెక్టర్‌ను పెట్టి, స్క్రిప్టింగ్ మార్పులు చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఇందులో నీ కష్టం ఏముంటుంది? నీ జర్నీ నీది, నీ ఎక్స్ పీరియన్స్ నీది.. నువ్వు నటుడిగా ఎలా ఈ పరిశ్రమలో ఎదుగుతావు? అనేది నువ్వే చూసుకోవాలి అని విజయ్ చెప్పాడు" అని ఆనంద్ తెలిపారు.

అన్నయ్య కష్టాన్ని దగ్గరుండి చూశాను

అన్నయ్య కష్టాన్ని దగ్గరుండి చూశాను


సినిమా ఇండస్ట్రీలో స్టాండ్ అవ్వడం ఎంత కష్టమో తెలుసు. నేను అన్నయ్య కష్టాన్ని దగ్గరుండి గమనించాను. సినిమా అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగడం చూశాను. థియేటర్ చేస్తూ సినిమాల కోసం ట్రై చేశాడు. అందుకే నేను కూడా అన్నయ్యలా ఎవరి సహాయం లేకుండా ఎదగాలనే ఇండస్ట్రీకి వచ్చినట్లు ఆనంద్ దేవరకొండ స్పష్టం చేశారు.

అందుకే అన్నయ్యను అడగలేదు

అందుకే అన్నయ్యను అడగలేదు


అన్నయ్యను నా సినిమా టీజర్ షేర్ చేయ్.. రీచ్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే మేము నిజాయితీగా సినిమా చేశాం కాబట్టి రేపు సినిమానే మాట్లాడుతుంది. ఎంత పుష్ చేయాలో అంత చేస్తాం... సినిమా బావుంటే చూస్తారు. మా అన్నయ్య టీజర్ షేర్ చేసినంత మాత్రన సినిమా ఆడదు.... అని ఆనంద్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X