అన్యాయం చేస్తే ఊరుకోను, పార్టీ లేదు, కులం లేదు: మంచు మనోజ్
Recommended Video

ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మోహన్ బాబు తిరుపతిలో చేపట్టిన ర్యాలీపై రాజకీయ దురమారం రేగిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ స్పోక్ పర్సన్ కుటుంబరావు మోహన్ బాబు మీద, శ్రీవిద్యానికేతన్ సంస్థల మీద విమర్శలు చేయడంతో... ఆవేశానికి లోనైన మంచు మనోజ్ కూడా ఎదురు దాడి ప్రారంభించారు.
అయితే ఈ పరిణామాలు మంచు కుటుంబం తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకం అనే సంకేతాలు వెలువడటానికి కారణమైంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఆ రోజు తాను అలా రియాక్ట్ అవ్వడానికి గల కారణం తెలిపారు.

పార్టీకు అతీతం, కులం, మంతం చూడదను
అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పార్టీలకి అతీతంగా ప్రజలకోసం నిలబడాలనుకునే మనిషిని. ఒక మనిషికి సాయం చేసేటప్పుడు తన కష్టం తప్ప కులం, మతం చూడకూడదు అని పూర్తిగా నమ్మే వ్యక్తిని... అని మనోజ్ తెలిపారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కాదు
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చేసిన దీక్షకి మద్దతుగా నేను నిలబడింది పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశ్యంతోనే కానీ ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను.

మా కాలేజీ పిల్లలకు అన్యాయం జరుగుతుందనే...
నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ మనిషిపై కాస్త కఠినంగా స్పందించింది కేవలం ఆయన మా కాలేజీలపై మోపిన తప్పుడు ఆరోపణల వల్ల తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. అది మా నాన్నగారు కష్టార్జితంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కట్టిన కాలేజీ. ఆ రోజు రోడ్ మీద మా నాన్నతో నడించింది, ఒక పెద్ద మనిషిపై తీవ్రంగా స్పందించింది కేవలం మా పిల్లలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో మాత్రమే.

ప్రజలకి అన్యాయం చేస్తే ఊరుకోను
ఈ మంచు మనోజ్.. ‘‘రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాసేవకి ఎప్పుడూ ముందుంటాడని, పది మందికి మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ పార్టీ తలపెట్టినా దానికి మద్దతుగా నిలబడతాడని, అలాగే ప్రజలకి అన్యాయం చేసే ఏ పార్టీనైనా నిలదీస్తాడని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.'' అని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











