twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్న డబ్బుతో జల్సాలు: మంచు మనోజ్ మీద పర్సనల్ ఎటాక్...

    |

    Recommended Video

    Manchu Manoj Responds On Fans Comments

    ప్రణయ్ హత్య గురించి తనదైన శైలిలో స్పందిస్తూ.... కులం పిచ్చోళ్లను ఏకిపారేసిన తెలుగు నటుడు మంచు మనోజ్ మీద... ఈ హత్యను సమర్దిస్తున్న కొందరు ఎదురు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మనోజ్ మీద వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తూ అతడి ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తూ కించ పరిచే ప్రయత్నం చేస్తున్నారు. తనపై అలాంటి కామెంట్లు చేసే వారిపై మనోజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వారికి తగిన విధంగా సమాధానం చెబుతున్నాడు ఈ మంచు స్టార్. ప్రణయ్ పరువు హత్య విషయంలో మరోసారి మంచు మనోజ్ తన వైఖరి తేల్చి చెప్పాడు.

    పని లేదు, నాన్న డబ్బుతో జల్సాలు, నీ పని బావుంది భయ్యా!

    ఎలాంటి పని చేయకుండా మీ నాన్న సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు సూపర్ బ్రో... లైఫ్ అంటే నీదే. యంగ్ జనరేషన్‌కు ఇన్స్‌స్పిరేషన్ నువ్వు అంటూ ఓ వ్యక్తి పెట్టిన కామెంటుకు మనోజ్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

    మా నాన్న డబ్బు ఎప్పుడూ వాడలేదు

    మా నాన్న సంపాదించిన డబ్బు వాడుకుంటే ఆయన ఎంతో సంతోషంగా ఫీలవుతారు. కానీ నేను ముందు నుండి ఆయన డబ్బు ముట్టుకోలేదు. సినిమాల విషయంలో కూడా ఆయన హెల్ప్ తీసుకోలేదు. కాలేజీ రోజుల్లో రెస్టారెంట్లలో వెయిటర్‌గా, క్లీనర్‌గా పని చేశాను. సినిమాల విషయంలో ఎప్పుడూ కొత్త డైరెక్టర్లను, కొత్త టీంను ఎంచుకుని ఎంచుకుని నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకుంటాను. అని మంచు మనోజ్ తెలిపారు.

    నేను చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి

    నేను చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి

    ఇటీవల ప్రణయ్ హత్య గురించి మంచు మనోజ్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో తాను చెప్పిన విషయం అర్థం చేసుకోకుండా... ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తమ ఓన్ కంక్లూజన్ ఇచ్చుకుంటున్నారు. పదవ తరగతిలో ఉన్న వారికి కులాలు, హోదా వంటివి తెలియవని చెప్పే ఉద్దేశ్యమే తప్ప మరో ఆలోచనలో లేదు. నేను చెప్పిన విషయాన్ని వక్రీకరించవద్దు అని మంచు మనోజ్ అన్నారు.

    మరొకరిని చంపే హక్కు లేదు

    మరొకరిని చంపే హక్కు లేదు

    కొందరు ప్రణయ్ హత్యను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారిని చూసినపుడు కోపం వస్తుంది. కారణాలు ఏమైనా సరే ఒక మనిషిని చంపే హక్కు మరొకరికి లేదు అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి అని మనోజ్ అన్నారు.

    ప్రేమించుకుంటే సపోర్ట్ ఇవ్వండి

    ప్రేమించుకుంటే సపోర్ట్ ఇవ్వండి

    ప్రతి ఒక్కరూ ఏదోఒక సమయంలో ప్రేమలో పడతారు. ఎవరైనా ప్రేమ వివాహం చేసుకుంటే వారికి తల్లిందండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మెచ్యూర్‌గా ఆలోచించి సపోర్ట్ ఇవ్వండి. హింసాత్మక చర్యలకు పాల్పడం సరికాదు... అని మంచు మనోజ్ అన్నారు.

    మీరు ఇడియట్ కావొద్దు, నన్ను ఇడియట్ చేయవద్దు

    మీరు ఇడియట్ కావొద్దు, నన్ను ఇడియట్ చేయవద్దు

    నేను చెప్పిన విషయాలను దయచేసి పాజిటివ్ వేలో తీసుకోండి. నేను చెప్పిన విషయాలను సగం అర్థం చేసుకుని మీరు ఇడియట్స్ కావొద్దు... నన్ను ఇడియట్‌ను చేయవద్దని మంచు మనోజ్ వ్యాఖ్యానించారు. కులం, మతం, ప్రాంతం, గౌరవం కంటే మానవత్వం అనేది ఎంతో ముఖ్యమని తెలిపారు.

    మీకు తల్లి, సోదరి, భార్, కూతురు ఉంటారు గుర్తుంచుకోండి

    కొందరు నన్ను నా ఫ్యామిలీ ప్రస్తావిస్తూ నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వక పోయినా ఫర్వాలేదు. కనీసం మహిళలకు గౌరవం ఇవ్వండి. మీకూ ఓ తల్లి, సోదరి, భార్య, కుమార్తె ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని మనోజ్ అన్నారు.

    English summary
    "My dad would be the happiest if I use his money :) But fortunately I never had to use his money or his help to make movies from start :) I worked in restaurant as a waiter/cleaner while in college and always opted for a new director and team to create my own life :) any doubts ?!" Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X