‘అభిషేక్ బచ్చన్ భార్యను ఎత్తుకెళ్తా.. ఆ స్టార్ హీరో గర్ల్‌ఫ్రెండ్స్‌ను కూడా’

టెలివిజన్ టాక్ షోలో హోస్ట్, గెస్టుల మధ్య ప్రశ్నలు చాలా ఫన్నీగా, సరసంతో కూడిన సైటైర్లు కనిపిస్తాయి. షోను రక్తి కట్టించాలంటే.. సాదాసీదాగా ప్రశ్నలు అడిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే కొందరు పనిగట్టుకొని ఆ ఎపిసోడ్‌ను ట్రెండ్ చేయడానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రశ్నలు అడుగుతుంటారు. అలా అడగడంలో బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, హోస్ట్ కరణ్ జోహర్ తనకు తానే సాటి అని కొత్తగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆయన ఓ హీరోను అడిగిన ప్రశ్నలకు అంతే కొంటెగా సమాధానం ఇస్తూ ఇంటర్వ్యూను ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. ప్రస్తుతం ఆ ట్రెండింగ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

కాఫి విత్ కరణ్ అనే టాక్ షో ఇండియాలోనే బెస్ట్ రియాలిటీ షోలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ షోకే అత్యంత పాపులారిటీ ఉంది. అనేక మంది స్టార్స్ వచ్చి.. తమదైన శైలిలో ఆకట్టుకొన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం సీరియల్ కిస్సర్‌గా పేరున్న ఇమ్రాన్ హష్మీ.. ఆయన బంధువు,ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ ఇద్దరు పాల్గొన్నారు.

I Steal Aishwarya Rai Serial Kisser Imran Hashmi funny Answer to Karan Johar in Coffee with Karan

అయితే ఇమ్రాన్ హష్మీని కరణ్ జోహర్ తనదైన శైలిలో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. చాలా సార్లు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఇమ్రాన్.. తనదైన శైలిలోనే స్పందించారు. కరణ్ కొంటెతనానికి ఇమ్రాన్ కాస్త సరసం జోడించారు. దాంతో హిలేరియస్‌గా ప్రశ్నలు, జవాబులు పోటాపోటీగా వచ్చాయి.

కరణ్, ఇమ్రాన్ మధ్య ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు సరదాగా సాగిపోయాయి. ఇమ్రాన్ హష్మీకి ప్రశ్నలు వేస్తూ.. నేను చెప్పే స్టార్ హీరోల ఇంట్లో నుంచి ఏం దొంగిలించాలని అనుకొంటున్నావు అని ప్రశ్నించాడు. ముందుగా అభిషేక్ బచ్చన్ పేరు చెప్పాడు. దాంతో ఆయన భార్య ఐశ్వర్యరాయ్‌ని దొంగిలించాలని అనుకొంటున్నాను అని అన్నాడు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ పేరు చెబితే.. ఆయన గర్ల్ ఫ్రెండ్స్‌ను అని అన్నారు.

ఇక షారుక్ ఖాన్ పేరు చెబితే.. ఆయన మన్నత్ బంగ్లాను దొంగిలించాను అని ఇమ్రాన్ హష్మీ చెబితే.. థ్యాంక్స్ గాడ్.. ఆయన భార్య గౌరీని ఎత్తుకెళ్లాలని చెప్పలేదు అని అన్నాడు. సైఫ్ ఆలీ ఖాన్ పేరు చెబితే.. ఆయన భార్య కరీనా కపూర్‌ను ఎత్తుకెళ్లుతాను అని చెప్పాడు. ఇలా సరదాగా దొంగిలించడంపై సమాధానాలు చెప్పి ఆకట్టుకొన్నాడు.

అయితే ఎవరి భార్యలను కూడా వదలడం లేదుగా. అంటే.. నేను కేవలం గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవడానికే నేను ఈ సమాధానాలు చెబుతున్నాను. నా మనసులో అలాంటి భావన లేదు. అంతేకాకుండా నిన్ను కూడా సంతృప్తి పరచాలి కదా అంటూ కరణ్‌పై ఇమ్రాన్ హష్మీ సెటైర్లు వేశాడు. అలా వారిద్దరి మధ్య ర్యాపిడ్ ఫైర్ అలా క్రేజీగా ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X