విలన్ పాత్రలు చేయాలని ఉంది, కానీ కేసులు పెడతారేమో: బాలయ్య

Recommended Video

Balakrishna Says 'I Wants Do A Negative Roles'

టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన బాలయ్యను అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య తనదైన మ్యానరిజంతో విలన్లను చితక్కొడుతుంటే అభిమానులు ఆనందంతో పరవశించి పోతుంటారు. మరి అలాంటి బాలయ్యను విలన్ పాత్రలో అభిమానులు ఊహించుకోగలరా? అసలు ఆ మాట అంటే వినే ధైర్యం కూడా వారికి ఉండదేమో. విలన్ పాత్ర అనే మాట అంటూ వస్తే అది బాలయ్య నోటి నుండే రావాలి. అవును... మీరు విన్నది నిజమే, ఇటీవల ఓ సందర్భంలో బాలయ్య స్వయంగా తనకు నెగెటివ్ పాత్రలు చేయాలని ఉందంటూ వ్యాఖ్యానించారు.

సైమా వేడుకలో బాలయ్య కామెంట్

సైమా వేడుకలో బాలయ్య కామెంట్

ఇటీవల దుబాయ్‍‌లో జరిగిన సైమా 2018 అవార్డ్స్ వేడుకకు బాలయ్య, రానా కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో చిట్ చాట్ చేసిన యాంకర్.... పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

నాకూ నెగెటివ్ రోల్ చేయాలని ఉందన్న బాలయ్య

నాకూ నెగెటివ్ రోల్ చేయాలని ఉందన్న బాలయ్య

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్‌కి నామినేట్ అవ్వడం ఎలా ఉంది అని రానాను యాంకర్ ప్రశ్నించగా..... రానా సమాధానం అనంతరం, బాలయ్య కల్పించుకుని నాకు కూడా నెగెటివ్ రోల్స్ చేయాలని ఉందంటూ వ్యాఖ్యానించారు.

అలా చేస్తే నాపై చాలా మంది కేసులు పెడతారు

నాకు నెగెటివ్ రోల్స్ చేయాలని ఉంది కానీ..... అలా చేస్తే నాపై చాలా కేసులు పెడతారు అంటూ బాలయ్య చమత్కరించడంతో నవ్వులు పూశాయి. జస్ట్ జోక్ చేయడానికే బాలయ్య తాను నెగెటివ్ రోల్ చేస్తానని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ మూవీ గురించి

ఎన్టీఆర్ మూవీ గురించి

తన తండ్రి బయోపిక్ ‘ఎన్టీఆర్' చేయడం గర్వంగా ఉందని, తండ్రి పాత్రను పోషించే అవకాశం కొడుకుగా నాకు దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు బాలయ్య ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాకు విద్యా బాలన్, రానా లాంటి మంచి నటులు కూడా దొరికారని, దర్శకుడు క్రిష్ సినిమాను అద్భుతంగా తీస్తున్నారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X