నచ్చితే నచ్చుతా, నచ్చకపోయినా ఫర్వాలేదు, మీ కోసం మారను : విజయ్ దేవరకొండ

Recommended Video

'My Job Is To Act And Tell Stories, Not To Be Liked By People' Says Vijay Devarakonda || Filmibeat

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. శుక్రవారం(జులై 26)న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది.

ఇటీవల సినిమా ప్రమోషన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... 'డైరెక్టర్లకు ఒక హీరోను చూసినపుడు ఇలాంటి కథ ఇతడితో చేయాలి అనుకుంటాడు. నేను చేసే సినిమాల ప్రకారం నా వద్దకు ఒక రకమైన స్క్రిప్టులు వస్తాయి. వాటిలో నాకు నచ్చింది చేస్తాను.' అని చెప్పుకొచ్చారు.

నేను నాలా ఉంటాను, ఇంకొకరి కోసం మారను

నేను నాలా ఉంటాను, ఇంకొకరి కోసం మారను

ఇలా చేస్తే రైటు, ఇలా చేస్తే రాంగ్ అని ఎప్పుడూ అనుకోను. చాలా మంది అడ్వైజెస్ ఇస్తుంటారు. ఇలా ఉండాలి, అలా చేయాలి.. ఒక యాక్టర్ అంటే ఇలా మాట్లాడాలి అని అందరికీ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. కానీ నేను నాలాగే ఉంటాను. ఇతరులు కోరుకున్న విధంగా నేను ఉండలేను. మనం అందరం ఎవరికి వారే యునిక్. మనలా ఇంకొకరు ఉండరు. అందుకే నేను ఇంకొకరి కోసం మారను... అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.

ఒకప్పుడు నేనూ అలాగే ఉన్నాను...

ఒకప్పుడు నేనూ అలాగే ఉన్నాను...

మనకు స్కూలుకు వెళ్లినప్పటి నుంచే మనంపై ఇలా ఉండాలి, అలా చేయాలి అని రుద్దడం మొదలవుతుంది. అందరూ ఒకే యూనిఫాం వేసుకోవాలి, ఒకే ఆన్సర్ రాయాలి.. ఇదే కరెక్ట్ ఆన్సర్ అంటూ అందరినీ ఒక పద్దతిలో ఉంచే ప్రయత్నం చేస్తారు. ఒకానొక సమయంలో సొసైటీ ట్రైన్ చేసినట్లే నేను ఉన్నాను.

కష్టాలతో యుద్ధం చేశాను, మారిపోయాను

కష్టాలతో యుద్ధం చేశాను, మారిపోయాను

కానీ పెరిగే కొద్దీ జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను. కష్టాలతో యుద్ధం చేశాను. ఆ సమయంలో ఆ ట్రైనింగ్ అంతా పోయి నేను ఎలా ఉండాలనుకున్నానో అలా మారిపోయాను. ప్రతి సక్సెస్ మనపై మనకు నమ్మకం పెంచుతుంది. నీపై నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

 మీకు నచ్చితే నచ్చుతా, నచ్చకపోయినా ఫర్వాలేదు

మీకు నచ్చితే నచ్చుతా, నచ్చకపోయినా ఫర్వాలేదు

వాళ్లకు అలవాటు ఉన్నట్లు నేనెందుకు ఉండాలి? నన్ను వాళ్లు అలవాటు చేసుకుంటారు అనే ఆలోచనలోకి మారిపోయాను. నన్ను నాలా ఉండనీయండి, మీకు నచ్చితే నచ్చుతా, నచ్చకపోయినా ఫర్వాలేదు అనే మెచ్యూరిటీ నాలో వచ్చింది.. అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X