ఎవడు ఏమన్నా నేను తిరిగి వస్తాను: తెలుగు ఇండస్ట్రీపై సిద్దార్థ్ కామెంట్!

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి హిట్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో సిద్ధార్థ్... ఆ తర్వాత 'బొమ్మరిల్లు' మూవీతో మరో సంచలన విజయం నమోదు చేశారు. అయితే బొమ్మరిల్లు తర్వాత సరైన కథలు ఎంచుకోక పోవడమో? అదృష్టం కలిసి రాలేదో? తెలియదు కానీ... సిద్ధార్థ్ సక్సెస్ రేటు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది.

ఆ తర్వాత ఆయన ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు, 180, లవ్ ఫెయిల్యూర్‌, ఓ మై ఫ్రెండ్ లాంటి చిత్రాలు చేశారు. అయితే ఈ సినిమాలేవీ విజయం సాధించలేదు. దీంతో క్రమక్రమంగా సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు.

సునీల్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసిన సిద్ధార్థ్

తాజాగా సిద్ధార్థ్ తన ట్విట్టర్ అకౌంట్లో తెలుగు కమెడియన్ సునీల్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. నా జీవితంలోని బెస్ట్ ఫ్రెండ్స్‌లో సునీల్ ఒకరంటూ పేర్కొన్నారు. ఈ ఇద్దరూ కలిసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, చుక్కల్లో చంద్రుడు, ఆట, ఓయ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

తెలుగు ఇండస్ట్రీకి రావాలంటూ...

తెలుగు ఇండస్ట్రీకి రావాలంటూ...

సిద్దార్థ్ ఆ ఫోటో షేర్ చేయగానే... పలువురు తెలుగు ఫ్యాన్స్ స్పందిస్తూ మీరు తెలుగులో మళ్లీ సినిమాలు చేయాలని, మీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. తెలుగు అభిమానులు వరుస ట్వీట్ చేయడంపై సిద్ధార్థ్ స్పందించారు.

ఎవడు ఏమన్నా నేను తిరిగి వస్తాను

ఎవడు ఏమన్నా నేను తిరిగి వస్తాను

‘ఎవడేమన్నా నేను మళ్లీ తిరిగొస్తాను లే... నేను చేసిన ఈ ప్రామిస్‌ రాసి పెట్టుకోండి.. నా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి త్వరలో తిరిగి వస్తాను. 18 నెలలు సమయం ఇవ్వండి ప్రేక్షకులారా. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. మంచి కంటెంట్‌ ఉంది. కష్టపడతాను. మాట్లాడుకుందాం' అని సిద్దార్త్ ట్వీట్ చేశారు.

సిద్ధార్థ్

సిద్ధార్థ్

సిద్దార్థ్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు చేస్తున్నారు. ‘శివప్పు మంజల్ పచాయ్'లో జీవి ప్రకాష్ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు ‘సైతాన్ కా బచ్చా' అనే చిత్రం కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X