బాబాయే మా పెద్ద దిక్కు, అటు వైపు వెళ్లను: ఎన్నికల వేళ నందమూరి కళ్యాణ్ రామ్ హాట్ కామెంట్!
ఎలక్షన్స్ వస్తున్నాయి బ్రేక్ ఏమైనా తీసుకుంటున్నారా? పార్టీకి ప్రచారం చేస్తారా? అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నందమూరి కళ్యాణ్ రామ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రాజకీయాల వైపు వెళ్లనుగాక వెళ్లను... త్వరలో నా నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేస్తున్నాను. రెండు పడవల మీద ఎప్పుడూ కాలు వేయకూడదు. పార్టీతో అసోసియేషన్ అయితే ఉంటుందని స్పస్టం చేశారు.
రాజకీయాల్లో ప్రచారం చేయాలంటే మనకు వాటి మీద అవగాహన ఉండాలి. నాకు సినిమా మీద అవగాహన ఉంది కాబట్టి మాట్లాడగలను. ప్రతి రోజూ పేపర్ చదువుతాను, రాష్రంలో, దేశంలో ఏం రాజకీయం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుంటాను. దాని అర్థం నేను అందులో ఉన్నట్లు కాదు. రాజకీయం అనేది పూర్తిగా విభిన్నమైందని కళ్యాణ్ రామ్ అన్నారు.

ముందు సినిమాల్లో సక్సెస్ అవ్వాలి
నాన్నగారి రాజకీయ వారసత్వం తీసుకోవడం అంటే దానికి చాలా సమయం ఉంది. ముందు సినిమా రంగంలో రెండు మూడు హిట్లు కొట్టనీయండి... అంటూ కళ్యాణ్ రామ్ జోవియల్‌గా రియాక్ట్ అయ్యారు.

చిన్నతనంలో చాలా కోతి వేశాలు వేశాను
చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ... స్కూలుకు వెళ్లే రోజుల్లో చాలా కోతి వేశాలు వేసేవాడిని, మా ఇంట్లో కూడా చాలా వెదవ వేశాలు వేసాను. అమ్మా నాన్నకు చెప్పకుండా సైకిల్ వేసుకుని వెళ్లిపోయేవాడిని, స్కూల్‌లో పిల్లలను మానిటర్ చేయమని టీచర్ నన్ను లీడర్‌గా ఉంచి వెళితే వారు నా మాట వినము లేదని జుట్టుకత్తిరించడం లాంటివి చేశాను.

మా తాతగారి మీద ప్రభావం పడుతుందని చెప్పారు
అపుడు మా టీచర్ పిలిచి నువ్వు రామారావుగారి మనవడివి ఇలాంటి పనులు చేయకూడదు అన్నారు. నువ్వు జీవితంలో ఏం చేసినా అది నీ క్యారెక్టర్ మీద మాత్రమే కాదు మీ ఫాదర్ మీద, గ్రాండ్ ఫాదర్ మీద పడుతుంది. వారి షాడో ఎప్పటికీ మీ మీద ఉంటుందని క్లాస్ పీకారు. అప్పటి నుంచి ప్రవర్తన మార్చుకున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు.

నాన్నగారి మరణంతో నందమూరి కుటుంబం షేక్ అయింది
నాన్నగారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం షేక్ అయింది. ఎందుకంటే.. నందమూరి ఫ్యామిలీకి ఆయన టైగర్. ఒక పెద్ద దిక్కు... ఏ కష్టం వచ్చినా ముందొచ్చి నిల్చునే వ్యక్తి ఇక లేరనే విషయం ఎవరూ తట్టుకోలేకపోయారు.

ఇపుడు బాబాయే మాకు పెద్ద దిక్కు
నాన్నగారు లేరు కాబట్టి మా నందమూరి ఫ్యామిలీ అందరికీ ఇప్పుడున్న పెద్ద దిక్కు బాబాయ్ బాలకృష్ణగారే. మా తాత రామారావుగారి తర్వాత మాకు ఉన్న ఇద్దరు పెద్ద దిక్కు నాన్నగారు, బాబాయిగారు. నాన్నగారు లేరు కాబట్టి బాబాయే అన్నీ చూసుకుంటున్నారు. అలా ముందు ఉండి చూసుకునే వ్యక్తి ఒకరు ఉండాలి... అని కళ్యాణ్ రామ్ అన్నారు.


Click it and Unblock the Notifications











