HBD Allu Arjun : భారీగా పెరిగిన అల్లు అర్జున్ సంపద విలువ .. పుష్ప 2 తర్వాత ఎన్ని వందల కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఆయన కుటుంబం నుంచి డజను మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు మెగాస్టార్ వారసులుగా బరిలోకి దిగారు. తర్వాతి తరంలో చిరంజీవి బావమరిది, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, దివంగత అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ఈరోజు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కెరీర్, రికార్డులు, ఆయన సంపద వంటి వివరాలు చూస్తే:

తెలుగు తెరకు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారసులను పరిచయం చేసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అల్లు అర్జున్. ఈ చిత్రానికి అశ్వినీదత్, అల్లు అరవింద్, కే రాఘవేంద్రరావులు నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. తొలి సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న బన్నీ.. ఆ తర్వాత ఆర్యతో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అనంతరం బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో తెలుగునాట స్టైలీష్ స్టార్‌గా ఎదిగారు.

Icon Star Allu Arjun birthday special here s the Pushpa 2 Actor s net worth and Assets Details

ప్రతి సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకుంటూ నటన, డైలాగ్స్, ఫైట్స్‌లో వైవిధ్యం చూపించారు. ఎలాంటి కఠినమైన స్టెప్స్ అయినా సరే అలవోకగా చేస్తూ మేనమామ చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టారు. పరుగు, వరుడు, బద్రీనాథ్, రుద్రమదేవి వంటి విలక్షణ చిత్రాలలోనూ నటించి తనలోని కొత్త కోణాన్ని చూపించారు. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురం చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ కెరీర్‌ను పుష్ప సిరీస్ మలుపు తిప్పింది.

పీరియాడికల్ సినిమాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పుష్పలో డీ గ్లామర్ రోల్‌లో అల్లు అర్జున్ నటన, మేనరిజానికి యావత్ భారతదేశం పూనకాలతో ఊగిపోయింది. ఉత్తరాది ప్రేక్షకులు పుష్పరాజ్‌ను నెత్తిన పెట్టుకున్నారు. పుష్ప ది రైజ్‌లో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డుల్లోకెక్కారు బన్నీ.

పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్‌తో అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. దాదాపు రూ.1870 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది పుష్ప. త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా, కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో మరో సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నారు.

హాలీవుడ్ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ .. భారతదేశంలోనూ కాలుపెట్టగా ఈ తొలి సంచిక కవర్ పేజీపై అల్లు అర్జున్ ప్లేస్ దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా బన్నీ నిలిచారు. అలాగే మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఉంది. 2011 మార్చి 16న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. టాలీవుడ్‌లోని బలమైన కుటుంబానికి చెందిన అల్లు అర్జున్‌ ఆస్తులు, సంపద విషయంలోనూ టాప్‌లో ఉన్నారు.

సినిమాకు రూ.200 నుంచి రూ.300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అల్లు అర్జున్ .. సినిమాలు, వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలతో భారీగానే ఆస్తులు కూడబెట్టారు. బన్నీ సంపద విలువ రూ.500 కోట్ల పైమాటేనని ఫిలింనగర్ టాక్. ఏఏఏ పేరుతో మల్టీప్లెక్స్‌లతో పాటు బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్స్, హెల్త్‌కేర్ రంగంలో కాల్ హెల్త్ సర్వీసెస్‌ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్ధతో పాటు ఆహా ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.

అలాగే మూడేళ్ల క్రితం అల్లు స్టూడియో పేరుతో సొంత స్టూడియోను నిర్మాణానికి బన్నీ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బన్నీకి విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ రూ.100 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. అల్లు అర్జున్ వద్ద ఖరీదైన రేంజ్ రోవర్ వాగ్యూ, వోల్వో ఎక్స్‌సీ 90 టీ8 ఎక్స్‌లెన్స్, హమ్మర్ హెచ్ 2 ఉన్నాయి. అల్లు అర్జున్ జీవితంలో మరెన్నో విజయాలు సాధించి, మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X