మాలాంటి పోరంబోకులకు నేషనల్ అవార్డా? రాష్ట్రపతి నుంచి పురస్కారమా? అల్లు అర్జున్ ఎమోషనల్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే బన్నీ.. పుష్ప ది రైజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అప్పటి నుంచి స్టైలిష్ స్టార్ చాలా ఎగ్జైటింగ్ అండ్ హ్యాపీగా కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబం కూడా తెగ ఖుషీ అవుతుంది. ఈక్రమంలోనే అవార్డు అందుకొని హైదరాబాద్ కు తరిగిన వచ్చిన పుష్పరాజ్ కు మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఓ అదిరిపోయే పార్టీ ఇచ్చారు.
ఈ సందర్భంగానే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. అలాగే చాలా ఫన్నీగా మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన విషయాలను గుర్తు చేశారు. తన మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి తాను అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ఈ సినిమాలో.. అల్లు అర్జున్ యాక్టింగ్ కు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో డైరెక్టర్ సుకుమార్ చాలా కష్టపడినట్లు తెలిపారు. ఒక్కో షాట్ ను మూడు, నాలుగు సార్లు తీస్తే.. ఇదేంటి సార్ ఇంత అవసరమా అని ప్రశ్నిస్తే.. మీ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు వస్తే చాలు.. డబ్బు, సినిమా హిట్టు గురించి నాకేం అవసరం లేదని సుక్కు చెప్పినట్లు తెలిపాడు.

అలాగే హిందీ చిత్ర పరిశ్రమలు వెళ్లిపోమని దేవిశ్రీ ప్రసాద్ కు చాలా సార్లు చెప్పానని అల్లు అర్జున్ తెలిపాడు. 20 ఏళ్ల నుంచి ఎంత చెప్పినా... ముందు నువ్వెళ్లు, ఆ తర్వాత నేను వచ్చేస్తా అంటూ చెప్పేవాడని వివరించాడు. డీఎస్పీ మాటలు విని మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడినని.. కానీ ఇప్పుడు ఆ కళ నిజం అయిందని తెగ సంబరపడిపోయాడు బన్నీ. ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టామని.. అక్కడ మంచి విజయాన్ని అందుకున్నామని తెలిపాడు.
జాతీయ అవార్డుల కోసం మా పేర్లు ప్రకటించినప్పుడు తనకంటే తన తండ్రి చాలా ఎక్కువ సంతోష పడ్డాడని చెప్పాడు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్లు అనిపిస్తుందంటూ ఆయన చెప్పిన మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని వివరించాడు. అలాగే ఎప్పుడూ ప్రిన్సిపల్ దగ్గర టీసులు తీసుకునే మేము.. ఈరోజు ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని ఎప్పుడైనా అనుకున్నావా అంటూ తన తండ్రిని అడిగినట్లు చెప్పాడు. తన స్నేహితులు కూడా ఈ పోరంబోకులకా జాతీయ అవార్డు వచ్చిందని అనుకుంటూ ఉంటారని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

అలాగే తాను ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మనం అనుకుంటామని.. కానీ మనతోపాటు మన పక్కన ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏవైనా జరుగుతాయని అల్లు అర్జున్ స్పష్టం చేశాడు. జాతీయ అవార్డు అందుకోవాలని తాను ఎప్పటి నుంచో అనుకున్నానని.. కానీ తనకు అవార్డు రావాలని సుకుమార్ మరింత ఎక్కువగా కోరుకున్నారని చెప్పారు. అందువల్లే తాను ఈ అవార్డు అందుకోగల్గినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











