Pushpa 2: అల్లు అర్జున్ కు ఊహించని స్పెషల్ గిఫ్ట్.. మురిసిపోతున్న బన్నీ.. ఎవరు ఇచ్చారంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే హిందీ ప్రేక్షకులు, విదేశీయులు సైతం వాటిని రీల్స్, రీక్రియేట్ చేసేలా చేశాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చే 'పుష్ప: ది రూల్' పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అది ఎవరు ఇచ్చారనే వివరాల్లోకి వెళితే..

సెన్సేషన్ క్రియేట్ చేసి..

సెన్సేషన్ క్రియేట్ చేసి..

పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెసింది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల యాక్టింగ్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. ఇక సమంత అదిరిపోయే స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ కథతో..

గంధపు చెక్కల స్మగ్లింగ్ కథతో..

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది.

మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా రూ. వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగ్గా.. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం.

విలన్ గా జగపతి బాబు..

విలన్ గా జగపతి బాబు..

పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్ క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో పుష్పరాజ్ ను స్ట్రాంగ్ గా ఢీకొట్టబోయేందుకు తన సెంటిమెంట్ నటుడు అయిన జగపతి బాబును రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా జగపతి బాబుకు సంబంధించిన షూటింగ్ ను వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారని సమాచారం.

అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్..

అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్..

ఇప్పటికే వైజాగ్ లో పుష్ప 2 షూట్ కంప్లీట్ కాగా.. హైదరాబాద్ లోని రామోజీ ఫిలీం సిటీలో జరిగే తర్వాత షెడ్యూల్ లో బన్నీ పాల్గొననున్నాడట. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కు ఊహించని స్పెషల్ బహుమతి వచ్చింది. అది ఎవరు ఇచ్చారంటే అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్. బన్నీ కుమారుడు అల్లు అయాన్ తన తండ్రికి బొమ్మ లారీని గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాకుండా దానిపై పుష్ప అని కూడా రాశాడు. పుష్ప సినిమాలో బన్నీ ఎక్కువగా లారీనే వాడిన విషయం తెలిసిందే.

ఎక్కేసిన లారీ డ్రైవర్ పాత్ర..

అయితే తనకు వచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు అల్లు అర్జున్. నా స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్ని బాబు నుంచి క్యూటెస్ట్ గిఫ్ట్ అని రాసుకొచ్చాడు బన్నీ. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పుష్ప మూవీలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించిన విషయం తెలిసిందే. బన్నీ క్యారెక్టర్ పెద్దలతోపాటు చిన్న పిల్లల్లో కూడా బాగా ఎక్కేసింది. అందుకే అల్లు అయాన్ తన తండ్రికి బొమ్మ లారీని బహుమతిగా ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X